CBI Court issues NBW against IAS Officer Srilakshmi జగన్ అక్రమాస్థుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీకి ఎన్బీడబ్యూ

Cbi court issues non bailable warrant against ias officer srilakshmi

IAS Officer, Sri Laxmi, Obulapuram Mining, Dalmia Cements, YS JaganMohan Reddy disappropriate assets case, ED, CBI case, Nampally, Telangana

CBI Court issues Non Bailable Warrant against IAS Officer Srilakshmi in Dalmia cements Case in regard with YS JaganMohan Reddy disappropriate assets case as she is not appearing to the court.

జగన్ అక్రమాస్థుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీకి ఎన్బీడబ్యూ

Posted: 09/24/2021 05:36 PM IST
Cbi court issues non bailable warrant against ias officer srilakshmi

జగన్ అక్రమాస్థుల కేసులో అభియోగాలు ఎదర్కోంటున్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీపై నాంపల్లిలోని సీబిఐ కోర్టు నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీచేసింది. ఈ కేసులో పాటు అనుబంధంగా వున్న దాల్మియా సిమెంట్స్ కేసులో తరచూ గైర్హాజరవుతున్న శ్రీలక్ష్మిపై న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో భాగంగా వున్న ఉన్నత అధికారులే తమపై వున్న కేసుల విచారణకు న్యాయస్థానాలకు హాజరుకాకపోవడంపై మండిపడిన న్యాయస్థానం అమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నాంపల్లిలోని ఈడీ, సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణకు తరచూ గైర్హాజరవుతున్న శ్రీలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఇదిలావుండగా ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులోనూ ఏ6 నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. తనపై సీబీఐ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని అమె రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ పిటిషన్ ను కొట్టేసింది. నిబంధనలు ఉల్లంఘించి మరీ మైనింగ్ లీజు ఇచ్చారని, నిందితులతో కుమ్మక్కుకావడం ద్వారా ప్రభుత్వాన్ని మోసగించారన్న అభియోగాలు ఉన్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు పేర్కొంది. అలాగే, గతంలో పిటిషనర్‌కు అనుకూలంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం ఎత్తేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.

ఇదిలావుంచితే, రాంకీ కేసులో విచారణకు హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోయానని, తనపై గతంలో జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కొట్టివేయాలని కోరారు. స్పందించిన కోర్టు దానిని కొట్టివేసింది. వాన్‌పిక్ కేసులో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిల తరపున న్యాయవాదుల హాజరుకు హైకోర్టు అనుమతించినా వారు కూడా డుమ్మా కొట్టడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసిన కోర్టు.. ఈసారి విచారణకు రాకుంటే తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles