Sonu Sood breaks his silence on IT raid controversy మన నిజాయితీ గురించి కాలమే చెబుతుంది: సోను సూద్

Actor sonu sood tweets after tax raids every rupee in my foundation

Sonu Sood, sonu sood IT raids, sonu sood income tax Rs 20 crore evasion, sonu sood statement, first statement, Mumbai, Income Tax officials, IT Raids, tax evasion case, Rs 20 crore, Sonu Sood IT, Sonu Sood Tax Evasion, IT Department, CBDT, sonu sood news, sonu sood updates

After tax raids took place at his offices in Mumbai a few days ago, actor Sonu Sood has now finally reacted to the ongoing controversy. The `Dabangg` star, who has been providing assistance to those in need amid the ongoing pandemic through his charitable trust, on Monday, posted a statement on his social media handles.

మన నిజాయితీ గురించి కాలమే చెబుతుంది: సోను సూద్

Posted: 09/20/2021 11:53 AM IST
Actor sonu sood tweets after tax raids every rupee in my foundation

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ఆస్తులపై ఐటీ సోదాలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ముంబైలోని ఆయన నివాసంతోపాటు.. నాగ్ పూర్‌, జైపుర్ లలో ఏకకాలంలో సోదాలు నిర్వ‌హించారు. సోనూ సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. దాడులు పూర్తైన త‌ర్వాత ఐటీ అధికారులు సోనూసూద్.. ​ రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్​ ఎగ్గొట్టాడని వెల్లడించారు. దీనిపై తాజాగా సోనూసూద్ స్పందించారు. తన ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి కూడా నిరుపేద‌ల జీవితాల కోసం పోగు చేసిందేనని అన్నాడు. నిరుపేదల ప్రేమతో అధ్వాన్నంగా ఉన్న‌రోడ్లపై కూడా తన ప్ర‌యాణం సుల‌భం అవుతుందని అన్నారు.

ఇక మ‌న నిజాయితీ గురించి మనమే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాలమే నిజానిజాలను కాలక్రమేనా వెల్ల‌డిస్తుందని అన్నారు. దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని.. తనకు అదే కొండంత బాలానిస్తుందని అన్నారు. అంతేకాదు తన జర్నీ ఇలాగే కొనసాగుతుంటుందని సష్టం చేశారు. మాన‌వ‌తా కార‌ణాల‌తో కొన్ని బ్రాండ్ల‌ను సైతం ప్రోత్సహించానని.. నాలుగు రోజులుగా తాను తన అతిథులు( ఐటీ అధికారులు)తో బిజీగా ఉన్నాను. ఆ కార‌ణం వ‌ల్ల‌నే ప్రజల సేవ‌లో ఉండ‌లేక‌పోయానని అన్నారు. ఇప్పుడు తిరిగి వ‌చ్చానని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు‌. తాను చ‌ట్టానికి క‌ట్టుబ‌డే పౌరుడిని అని తెలిపారు.

ఆదాయపన్ను శాఖ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివ‌రాల‌ను స‌మ‌ర్పించాన‌ని, వాళ్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాన‌ని, త‌న పాత్ర తాను పోషించిన‌ట్లు సోనూసూద్ తెలిపారు. అయితే త‌నిఖీలు నిర్వ‌హించిన ఐటీశాఖ అధికారులు తాను చేసిన ప‌నుల‌ను మెచ్చుకున్నార‌ని, త‌న ప‌నిత‌నానికి గుర్తింపు ఇచ్చిన‌ట్లు చెప్పారు. మీరెప్పుడైనా ఇలాంటి డాక్యుమెంట్లు, పేప‌ర్ వ‌ర్క్‌ను చూశారా అని ఐటీ అధికారుల్ని అడిగాన‌ని, తాము ఎప్పుడూ ఇలాంటి పేప‌ర్ వ‌ర్క్ చూడ‌లేద‌ని వారు చెప్పిన‌ట్లు సోనూసూద్ గుర్తు చేశారు.

తాను ప్రజలకు మరీ ముఖ్యంగా కరోనా సమయంలో వలస కూలీలకు బోజనం, వారి స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యాలు కల్పించడంతో ఆయన చేసిన సేవలకు గాను త‌న‌కు రెండుసార్లు రాజ్య‌స‌భ సీటును ఆఫ‌ర్ చేశార‌ని, కానీ ఆ ఆఫ‌ర్ల‌ను వ‌దులుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇప్పుడే రాజ‌కీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేన‌ట్లు ఆయ‌న తెలిపారు. దాతృత్వ ప‌నుల‌ను ఆప‌లేద‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తూంటూనే ఉన్నాన‌న్నారు. ఇటీవల సోనూసూద్‌.. దిల్లీ ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో తాజా ఐటీ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh