Ragging case reported in Kakatiya Medical college కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..

Warangal ragging case reported in kakatiya medical college

Ragging, Kakatiya Medical college, Junior student stripped, senior students ragging, uttar pradesh student, warangal Urban district, Telangana, Crime

An alleged ragging incident was reported in Kakatiya Medical college, Warangal district. According to the reports, senior students of the college allegedly ragged the juniors. It is learnt that the senior mounting pressure on juniors asking to listen to their orders and allegedly punishing the juniors who denied to listen to their statements.

ITEMVIDEOS: కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ల ఆడగాలు.. ర్యాగింగ్ పేరుతో..

Posted: 09/17/2021 12:10 PM IST
Warangal ragging case reported in kakatiya medical college

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో మరోమారు ర్యాగింగ్ తో వార్తల్లో నిలిచింది. ఈ కళాశాలలో మరోమారు ర్యాగింగ్ భూతం జడలు విప్పిందన్న వార్త కలకలం రేపింది. కాలేజీలో సీనియర్లు మొదటి విద్యా సంవత్సరం విద్యార్థులను పరిచయం చేసుకునే క్రమంలో సరదా సాగాల్సిన ర్యాగింగ్.. జూనియర్ విద్యార్థులను ఏకంగా వారికి బానిసలుగా మార్చి.. వారు చెప్పింది ఎదురు మాట్లాడకుండా చేయాల్సిన పరిస్థితులకు దారితీస్తోంది. అంతేకాదు మరికోందరైతే వారి బట్టలను విప్పించి మరీ శునకానందం పోందుతుంటారు.

తాజాగా కాకతీయ మెడికల్ కాలేజీలోనూ అలాంటి ఆగడాలే జరిగాయి. మొదటి సంవత్సరంలో చేరిన ఓ విద్యార్థిని పట్ల సీనియర్లు తమ జులుం ప్రదర్శించారు. అయితే వారిని లెక్కపెట్టని విద్యార్థిని తన పని తాను చేసుకుంటూ వెళ్లడంతో సీనియర్లు అమెను టార్గెట్ చేశారు. హాస్టల్ గదిలోకి వెళ్లి మరీ విద్యార్థిని వేధింపులకు గురిచేశారు. తనను ర్యాగింగ్ చేయవద్దని ఎంత వేడుకున్నా విననీ సీనియర్లు అమెను దుస్తులు విప్పాలని అదేశించడంతో.. తీవ్రంగా మానసిక క్షోభకు గురైన విద్యార్థి తన తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపాడు. ఉత్తరప్రదేశ్ లోని ఓ రాజకీయ కుటుంబానికి చెందిన విద్యార్థి జాతీయ కోటాలో సీటు సాధించి కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు.

దీంతో కలవరపాటుకు గురైన బాధిత విద్యార్థి తల్లిదండ్రులు నేరుగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. అయితే జరిగిన పరాభవం పట్ల అప్పటికే తాను ప్రిన్సిపాల్ కు చెప్పినా అయన పెద్దగా చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదని విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నేరుగా విషయాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఎంఈ రమేశ్‌రెడ్డి వరంగల్ కేసీఎంసీకి వచ్చి ర్యాగింగ్ ఘటనపై ఆరా తీశారు. ఈ విషయమై కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ మాట్లాడుతూ.. ర్యాగింగ్ చేసిన విద్యార్థులు క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయిందన్నారు. మరోవైపు, బాధిత విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం వారి క్షమాపణతో శాంతించలేదని సమాచారం. ప్రస్తుతం వారు వరంగల్ లోనే ఉన్నారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles