PIL filed in HIgh Court on Saidabad Accused Raju Death సైదాబాద్ నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్

It is custodial death pil filed in high court on saidabad rape murder accused raju death

Saidabad rape case, Saidabad Accused dead, Pallakonda raju, Telangana High Court, Lakshmaiah, HRC president, Public interest Litigation, Saidabad rape, Pallakonda raju dead, custodial death, Railway tracks, station Gahanpur, Pallakonda raju encounter, Hyderabad rape, Telangana, Crime

On the Suicide death of the accused in Saidabad rape case, where a six-year-old child was raped and murdered on Sep 9, a Public Interest Litigation was filed in Telangana High Court by Human Rights Association President Lakshmaiah, stating that Raju death is a Custodial Death, not a suicide.

సైదాబాద్ నిందితుడి మృతిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

Posted: 09/17/2021 01:14 PM IST
It is custodial death pil filed in high court on saidabad rape murder accused raju death

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచ‌ల‌నం సృష్టించిన సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన అరేళ్ల చిన్నారి హ‌త్యాచారం కేసులో నిందితుడు రాజు నిన్న ఉదయం రైలు పట్టాలపై శవమై కనిపించడంతో అతని మృతిపై ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. మానవ మృగం తనకు తానుగా శిక్షవిధించుకుని చనిపోవడంపై ఉభయ రాష్ట్రాల వ్యాప్తంగా హర్షం వ్యక్తమైన తరుణంలో ఆయనది ఆత్మహత్య కాదని, కస్టోడియల్ మరణంగా అనుమానాం ఉందని పేర్కోంటూ పర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపించి నిజానిజాలు వెల్లడించాలని కోరారు.

చిన్నారిని చిదిమేసిన రాక్షసుడి విషయంలో రాష్ట్ర ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనలో నిందితుడన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారని స్వయంగా రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ట్వీట్ చేయడం.. ఆ తరువాత నిందితుడి ఆచూకీ చెబితే.. చెప్పినవారికి పది లక్షల రూపాయల బహుమానం ఇస్తామని పోలీసులు ప్రకటించడం.. దీంతో కేటీఆర్ తనకు తప్పుడు సమాచారం అందించారని తన ట్వీట్ ను సరిదిద్దుకోవడం అన్ని జరిగినా.. వారం రోజలైన నిందితుడ్ని పోలీసుల పట్టుకోకపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇక రాష్ట్రప్రజల నుంచి కూడా నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ వినిపించింది.

కాగా నిందితుడు పల్లకొండ రాజు వేషాలు మార్చుతూ తప్పించుకుని తిరుగుతున్నాడని పోలీసుల వెల్లడించారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం లభ్యమైంది. పోలీసులను చూసి తప్పించుకు పారిపోతూ వేగంగా వెళ్తున్న కోణార్క్ ఎక్స ప్రెస్ రైలుకు ఎదురువెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులూ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అతడి మరణంపై ఎన్నో అనుమానాలున్నాయని, దీనిపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ లక్ష్మణ్ పిల్ వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles