CBI registers nine cases In West Bengal Post-Poll Violence పశ్చిమ బెంగాల్: ఎన్నికల అనంతర హింసపై సీబిఐ 9 కేసులు

West bengal post poll violence cbi registers nine cases say sources

Mamata Banerjee,West Bengal post-poll violence,West Bengal news,post-poll violence,CBI,West Bengal poll violence,Calcutta HC, political news, politics nation,news, West Bengal, Crime

The Special Crime Branch of CBI has taken charge of 43 cases of post-poll violence in West Bengal. This includes 29 rapes and 12 murders. Meanwhile, the Kolkata High Court has set a deadline of six weeks for the submission of the preliminary report to the investigation agency.

పశ్చిమ బెంగాల్: ఎన్నికల అనంతర హింసపై సీబిఐ 9 కేసులు

Posted: 08/26/2021 05:46 PM IST
West bengal post poll violence cbi registers nine cases say sources

ప‌శ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత చలరేగిన హింస‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబిఐ దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కలకత్తా హైకోర్టులోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అదేశానుసారం దర్యాప్తును ప్రారంభించిన సీబిఐ 12 హత్యలతో పాటు 29 అత్యాచార ఘటనలపై దర్యాప్తును చేస్తోంది. ఈ కేసులన్నింటినీ ఆరు వారాల్లోగా దర్యాప్తు చేసి ప్రాథమిక నివేదికను అందేజేయాలన్న కలకత్తా హైకోర్టు అదేశాల మేరకు దర్యాప్తు సంస్థ తమ దర్యాప్తును ముమ్మరం చేసింది.

ఈ తరుణంలో నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలుగా ఏర్పడిన సీబిఐ రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాలకు పంపినట్లు ఓ అధికారి చెప్పారు. ఈ బృందాలలో సీబిఐ తూర్పు జోన్ డీఐజీ అఖిలేష్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు. ఈ నాలుగు బృందాలు వివిధ హింసాత్మక ఘటనలకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ కాఫీలతో పాటు న్యాయస్థానాల నుంచి పలు డాక్యూమెంట్లను కూడా సేకరించి పరిశీలిస్తాయని సమాచారం. ఈ క్రమంలో కేసు డాకెట్కు సంబంధించిన పిర్యాదుదారులతో, సాక్ష్యులను కూడా కలసి వారి పిర్యాదులను సెక్షన్ సిఆర్పీసీ 161, సిఆర్పీసీ 164ల మేరకు మెజిస్ట్రేల్ ముందు రికార్డు చేయనున్నారు,

హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లా ఎస్పీలు పంపిన వివరాలను కూడా సీబిఐ బృందాలు పరిశీలించనున్నాయి. ఇక ఇప్పటికే తమ తాతను కోల్పోయిన బీజేపి కార్యకర్త విశ్వజీత్ సర్కార్ కు సీబిఐ విచారించేందుకు సమన్లను జారీ చేసిన సీబిఐ.. ఆయన నుంచి మరింత కొత్త సమాచారాన్ని రాబట్టడంతో పాటు ఆయన సెల్ ఫోన్ నుంచి తన తాత అభిజిత్ సర్కర్ హత్యకు సంబంధించిన ఫూటేజీని కూడా స్వాధీనం చేసుకుంది. మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, వాటిలో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం విధితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles