Bullet Bandi marriage baraat dance going viral బుల్లెట్ బండి పాటతో వరుడికి షాకిచ్చిన వధువు.. భరాత్ డాన్స్ వైరల్

Bullet bandi couple responds to marriage baraat dance going viral

bride danci during baraat goes viral, brdie baraat dance viral online, bride baraat dance social media, bride baraat dance net, bride baraat dance on bullet bandi song, Bullet Bandi, baraat dance, marriage baraat dance, viral video, trending video, sai sreeya, Ashok, Mancherial district, Telangana

A video of bride by name Sai Sreeya performing a wonderful dance for Bullet Bandi song has gone viral on social media. She expressed happiness over her dance liked by lakhs of people.

ITEMVIDEOS: బుల్లెట్ బండి పాటతో వరుడికి షాకిచ్చిన వధువు.. భరాత్ డాన్స్ వైరల్

Posted: 08/19/2021 03:23 PM IST
Bullet bandi couple responds to marriage baraat dance going viral

పెళ్లి అంటూ నూరేళ్ల జీవితం.. తనను ఇన్నాళ్లు పెంచిన తల్లిదండ్రులను వీడి.. తనకు ఇకపై జీవితాంతం తోడునీడగా వుండే తన భర్తతో కలసి వధువు వేసే తొలి అడుగే పెళ్లి. యువతి జీవితంలో రెండో అంకం ప్రారంభానికి వేదికే పెళ్లి. అలాంటి పెళ్లిలో తనకు ఇకపై జీవితాంతం తోడుండే తన భర్తకు గుర్తిండిపోయే గిప్ట్ ఇవ్వాలని భావించింది ఓ వధువు. ఆ ఆనంద క్షణాలను మరింత మధురంగా మార్చుకోవాలని, అదే సమయంలో తన మనస్సులో దాచుకున్న మాటలను కూడా బయటపెట్టాలని అనుకుంది. నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకోబోతున్న సంతోషాన్ని..జీవితాంతం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుంది.

సిగ్గులమొగ్గవుతూ వరుడి పక్కన ఒదిగిపోవడం కాకుండా…స్వయంగా తనకు కాబోయే భర్తకు స్వాగతం పలికింది. తన గుణగుణాలు తెలియజేస్తూ రోడ్డుపై ఆడిపాడింది. భవిష్యత్ గురించి కన్న అందమైన కలలను వివరించింది. వరుడు చిరునవ్వులు చిందిస్తూ…చూస్తుండగా…బంధువులు, స్నేహితులు మధ్య ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తెలుగు నెటిజన్లంతా బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా…డుగ్గు…డుగ్గు..డుగ్గు..డుగ్గు అనే పాడుకుంటున్నారు. బుల్లెట్ బండి అనే ప్రయివేట్ ఆల్బమ్ సాంగ్‌కు వధువు చేసిన ఈ డ్యాన్స్‌ చూసి నెటిజన్లంతా ఫిదా అయ్యారు.

ఈ డ్యాన్స్ వీడియో యూట్యూబ్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. మొత్తానికి తన డ్యాన్స్‌తో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇంతగా పాపులర్‌ అయిన వధువు,వరుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా? మంచిర్యాల జిల్లా జన్నారంలో ఈ నెల 14న సాయిశ్రియ, అశోక్‌ పెళ్లి జరిగింది. పెళ్లి బరాత్‌లో వధువు సాయి శ్రియ ఇలా డ్యాన్స్ చేసింది. అది కాస్తా వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు ఫ్రెండ్స్. దీంతో వైరల్‌ అయ్యింది. తన భర్తను సర్‌ప్రైజ్‌ చేసేందుకే డ్యాన్స్ చేశానంది వధువు సాయి శ్రియ. సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles