Hyderabad startup’s e-bike bags design patent రూ.55వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. హైదరాబాదీ సంస్థకు పేటెంట్..

Atumobile s atum 1 0 cafe racer electric bike receives design patent

Atumobile Atum 1.0, Atum 1.0, electric bike, Atum 1.0 cafe racer, Hyderabad company, EV startup company, Atumobile Pvt Ltd, Atum 1.0, design Patent, Vamsi Gaddam, CEO, EV Auto, E-bike, Trending

Homegrown EV startup Atumobile Pvt Ltd on Wednesday said its bike Atum 1.0 has received a design patent for its unique design from the Controller of Patents and Designs. The patent has been issued for its design which leads to a riding posture one would have while riding sports bikes.

రూ.55వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. హైదరాబాదీ సంస్థకు పేటెంట్..

Posted: 07/29/2021 05:48 PM IST
Atumobile s atum 1 0 cafe racer electric bike receives design patent

ఇంధన ధరలు అమాంతం ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాలపైనే పడింది. ఏ బైక్.. లేదా ఏ ఈవీ టూవీలర్.. ఎన్ని కిలోమీటర్ల మైలైజ్.. ఎన్ని గంటల చార్జింగ్.. ఎంతటి వేగం అన్న అంశాలపైనే ఎక్కువగా చర్చసాగుతోంది. ఎక్కడ ఏ నలుగురు చర్చించుకున్నా అందులో ఇద్దరు ఈవీ టూవీలర్స్ విషయాన్నే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అందుకు ఇంధన ధరలపై పన్నుల భారం మోపి.. సామాన్యుడి భయకంపితుడయ్యేలా చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం కూడా లేకపోలేదన్న వాదనలు వున్నాయి.

ఈ నేపథ్యంలో కాసింత తక్కువ ధరకు ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. అచ్చంగా యమహా ఆర్ఎక్స్ 100 తరహాలో రూపోందిన ఎలక్ట్రిక్ బైక్ ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే ముందుగా ఈ బైక్ వివరాలను తెలుసుకోండి. హైదరాబాదుకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) తయారీ స్టార్టప్‌ అటుమొబైల్‌.. తమ కేఫ్‌-రేసర్‌ స్టైల్డ్‌ ఆటమ్‌ 1.0 మోడల్‌ బైక్ కు డిజైన్‌ పేటెంట్ ను సొంతం చేసుకున్నది. స్పోర్టియర్‌ రైడింగ్‌ భంగిమ, 14 లీటర్ల స్టోరేజి ట్యాంక్‌, ఆకర్షణీయ బాడీ స్ట్రక్చర్ కుగాను ఈ పేటెంట్‌ దక్కినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

స్టాండర్డ్‌, స్పోర్ట్‌, క్రూయిసర్‌ తదితర బహుళ రైడింగ్‌ భంగిమలు తమ బైక్‌ ప్రత్యేకతలని, తమ ఆర్ అండ్ డీ బృందం దీనికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చినట్లు సంస్థ సీఈవో గడ్డం వంశీ తెలిపారు. గతేడాది అక్టోబర్‌ 5న ఈ మోడల్ ను పరిచయం చేయగా, అప్పట్నుంచి దేశవ్యాప్తంగా 850 బుకింగ్ లు వచ్చాయని తెలిపారు. కాగా, ఏడాది వ్యారంటీతో వున్న లిథియం-ఇయాన్‌ బ్యాటరీ నాలుగు గంటల్లో పూర్తి చార్జ్‌ అవుతుందని, ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు. పటాన్ చెరువులో వీటిని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. లో-స్పీడ్‌ బైక్‌ కింద దీనికి ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఐసీఏటీ) అనుమతులు మంజూరు చేసినట్లు వివరించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles