Covid-19 cases increasing slowly in Hyderabad హైదరాబాదులో మళ్లీ కరోనా కేసుల వ్యాప్తి.. ధర్డ్ వేవ్ ముప్పుందా.?

Third wave alert as covid 19 cases increasing slowly in hyderabad

SARS, SARS-CoV-2, Antibody, Coronavirus, Coronavirus Disease COVID-19, Pandemic, Protein, Receptor, Respiratory, Severe Acute Respiratory, Severe Acute Respiratory Syndrome, Spike Protein, Syndrome, Virus, Coronavirus, Nightlife, Lockdown Restrictions, Covid norms, Telangana government, Hyderabad,

Covid cases are increasing in the State, and it could be a new variant or a third wave. It has been more than a month since the State government lifted the lockdown restrictions. The people who have been following the Covid norms now seem to be flouting.

అలర్ట్: హైదరాబాదులో మళ్లీ కరోనా కేసుల వ్యాప్తి.. ధర్డ్ వేవ్ ముప్పుందా.?

Posted: 07/29/2021 10:23 AM IST
Third wave alert as covid 19 cases increasing slowly in hyderabad

తెలంగాణలో కరోనా వైరస్ కాసింత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కరోనా నిబంధనలను పాటించకుండా తమ నిత్య వ్యవహరాల్లో నిమగ్నమయ్యారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, లేదా శానిటైజ్ చేసుకోవడానికి తిలోదకాలు ఇచ్చేశారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిన కరోనా రెండో దశ.. మే చివరి నాటికి దాని తీవ్రత, వ్యాప్తిని తగ్గిస్తూ వచ్చింది. దీంతో రెండు నెలలు గడిచిపోవడంతో ఇక ప్రజలు కోవిడ్ నిబంధనలను కూడా పాటించడం మానేశారు.

రాష్ట్రంలో గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన కరోనా మహమ్మారి.. మళ్లీ వ్యాపిస్తోంది. క్రమంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక గాంధీ అసుపత్రికి ప్రతి రోజు 30 కేసుల వరకు వస్తున్నాయి. టిమ్స్‌తోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. రెండో దశ ముగిసిందన్న నిర్లక్ష్యానికి తోడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు శుభకార్యాల్లో లెక్కకు మించి పాల్గొంటుండడం కూడా కేసుల పెరుగుదలకు మరో కారణమని చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మూడో ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌లో 40 శాతం మంది మాస్కులు ధరించడం లేదని పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల ముందు వరకు గాంధీ ఆసుపత్రికి రోజుకు 10 కేసులు రాగా, ఇప్పుడు 30 నుంచి 40 వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మంగళవారం 46 మంది, బుధవారం 32 మంది చేరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 361 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. గాంధీలో రోజుకు 30 మంది డిశ్చార్జ్ అవుతుండగా, అంతే స్థాయిలో చేరుతుండటం అందోళన కలిగించే అంశం. అయితే ఇందుకు కోవిడ్ నిబంధనలను పాటించకపోవడమే కారణమని వైద్యులు చెబుతున్నారు.

ఇక ఓ వైపు కరోనా మహమ్మారి ముప్పు పోంచివున్నా.. తమకు ఏ మాత్రం పట్టనట్టుగా యువత నైట్ లైఫ్ కి అప్పుడే తలుపులు తీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో రాత్రి 12 గంటల వరకు మాత్రమే వ్యాఫారాలు సాగాల్సివున్నా.. పోలీసుల కళ్లు గప్పి రాత్రి 2.గంటల వరకు హోటల్, పాన్, రెస్టారెంట్ల వ్యాపారాలు సాగుతునే వున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని శాలిబండ మొగల్ పుర, తలాబ్ కట్టా, చంద్రాయణగుట్టా, బహదూర్ పుర, యాఖత్ పుర, హుస్సేనీ అలం, ప్రాంతాల్లో ఎక్కువగా సాగుతుంది.

ఇక ఇక్కడికి చేరుకుంటున్న యువత కూడా ఎలాంటి కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ముప్పు పొంచివుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. యువత తమ జల్సాల కోసం రాత్రివేళ్లలోని నైట్ లైఫ్ కు అలవాటు పడి కరోనా బారిన పడితే వారిళ్లలోని పెద్దల మాటేమిటన్న ప్రశ్నలు కూడా అలోచించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆసుపత్రులకు చేరుకుంటున్న రోగుల్లో 75 శాతం మందికి వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి వస్తోందన్నారు. గాంధీలో కరోనా, బ్లాక్ ఫంగస్ రోగుల కోసం ప్రత్యేకంగా 400 పడకలు కేటాయించినట్టు తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యం వీడకుంటే మూడో ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని డాక్టర్ రాజారావు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  COVID-19  Delta variant  Pandemic  SARS-CoV-2  Hyderabad  Nightlife  Covid norms  Telangana govt  

Other Articles