CM’s security officers, district cops clash in Kullu కేంద్రమంత్రి సాక్షిగా పోలీసు ఉన్నతాధికారుల కొట్లాట.!

Watch sp kullu thrashed by himachal cm s security personnel during gadkari visit

Kullu SP Gaurav Singh, Range Office Mandi, Union Minister Nitin Gadkari, Himachal CM Jairam Thakur, CM's security personnel, Brijesh sood, Balvanth singh, DGP Sanjay Kundu, Himachal Pradesh #bjp #HPgovt #shimla #kullu #himachal

A clash broke out between Himachal Pradesh Chief Minister Jairam Thakur’s security personnel and senior police officials during Union minister Nitin Gadkari's three-day visit to the state.

ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి రాక సాక్షిగా పోలీసు ఉన్నతాధికారుల కొట్లాట.!

Posted: 06/24/2021 05:01 PM IST
Watch sp kullu thrashed by himachal cm s security personnel during gadkari visit

పోలీసు ఉన్నతాధికారుల మధ్య మాటామాటా సమాధానాలు పరిస్థితి దాటి వాగ్వాదానికి దారితీసాయి. అంతటితో ఆగకుండా ఒకరిపై మరోకరు చేయిచేసుకునే వరకు వెళ్లాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పర్యటన సందర్భంగా అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ వాహనంలోని సెక్యూరిటీ సిబ్బంది అధికారులకు.. కులు జిల్లా పోలీస్‌ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచుసుకుని కొట్లాటకు దారితీసింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే చేయిచేసుకోవడంతో ఈ గోడవకు కారణమైన ముగ్గురు అధికారులను రాష్ట్ర పోలీసు అధికారులు బలవంతపు సెలవులపై పంపించారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని భున్త‌ర్‌ విమానాశ్రయం సమీపంలో సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల పర్యటన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు షిమ్లాలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. ఫోర్ లేన్ ప్రభావిట్ కిసాన్ సంఘ్ సభ్యులు సీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా విమానాశ్రయం బయట గుమికూడారు. ఈ విష‌య‌మై సీఎం భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేశారు. కులు ఎస్పీ గౌర‌వ్ సింగ్‌ను నిల‌దీశారు. దాంతో స‌హ‌న‌నం కోల్పోయిన గౌర‌వ్ సింగ్ సీఎం భద్రతా సిబ్బందిలోని అద‌న‌పు ఎస్పీ స్థాయి అధికారి బ్రిజేష్ సూద్‌ను చెంప‌దెబ్బ కొట్టాడు.

దాంతో సీఎం పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ) బల్వంత్ సింగ్.. గౌర‌వ్‌సింగ్‌ను కాలితో తన్నాడు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌తాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. సంఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న ముగ్గురు అధికారులను విచారణ ముగిసే వరకు సెలవుపై పంపినట్లు రాష్ట్ర డీజీపీ సంజయ్ కుందు తెలిపారు. ప్రస్తుతం కులు ఎస్పీ బాధ్యతను డీఐజీ (సెంట్రల్ రేంజ్) మధుసూదన్ చూసుకుంటారని చెప్పారు. అలాగే బ్రిజేష్ సూద్‌ స్థానంలో పండోహ్ 3వ బెటాలియన్ చెందిన ఏఎస్పీ పునీత్ రఘును నియమించినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kullu SP Gaurav Singh  Brijesh sood  Balvanth singh  DGP Sanjay Kundu  Himachal Pradesh  Crime  

Other Articles