Telangana unlocks: All restrictions to be lifted తెలంగాణ అన్ లాక్.. జులై 1 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

Telangana unlocks schools colleges set to reopen july 1

telangana, unlockdown, telangana coronavirus cases, mask mandatory, no mask fine, school reopen, colleges reopen, educational institutions reopen, social distancing compulsory, telangana covid-19 cases, telangana news, Hyderabad

The COVID-19 lockdown has been lifted in all districts of Telangana from June 19 night. The state cabinet took the decision to not continue with the lockdown further as the COVID-19 cases have drastically come down.

తెలంగాణ అన్ లాక్.. జులై 1 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

Posted: 06/19/2021 05:52 PM IST
Telangana unlocks schools colleges set to reopen july 1

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన క్యాబినెట్.. కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు మూడో దశ కరోనా నేపథ్యంలో అందోళన చెందుతున్న క్రమంలో తెలంగాణలో మాత్రం కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని మంత్రివర్గం రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర ప్రాతిపదికన శనివారం మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గం లౌక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రాష్ట్రం లాక్ డౌన్ల కారణంగా తిరోగమనం వైపు పయనిస్తున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పురోగమనం వైపు పయనింపజేసేందుక చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలో ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ఇవాళ్టితో ముగియనుండగా.. అందరూ ఊహించినట్టు రాత్రి పూట కర్ప్యూలు కూడా లేకుండా తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ వేళల సడలింపుతోపాటు వివిధ అంశాలపై చర్చ జరగగా.. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, అంతర్జాతీయ సర్వీసులు విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ మొదలైన దగ్గరి నుండి ఇప్పటి వరకు ప్రతిసారి సడలింపులు పెరుగుతూ రాగా ఇక ఇప్పుడు రాష్ట్రంలో కేసులు కూడా చాలా స్వల్పంగానే నమోదవుతున్నాయి.

ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను తొలగించింది. ఆదివారం ఉదయంతో లాక్ డౌన్ ముగియనుండగా అప్పటి నుండి యధావిధిగా ప్రజా కార్యకలాపాలు మొదలు కానున్నాయి. నిజానికి లాక్ డౌన్ తొలగించినా రాత్రి కర్ఫ్యూ కొనసాగే వీలుంటుందని అంచనా వేశారు. కానీ ప్రభుత్వం అనూహ్యంగా పూర్తిస్థాయిలో లాక్ డౌన్ తొలగించింది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను ఈమేరకు కేబినెట్ ఆదేశించింది.

ఇక రాష్ట్రంలో జులై ఒకటో తేదీ నుంచి స్కూళ్లను తెరవాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించినా.. అవి విద్యార్థులకు ఎంత మేర అర్థమయ్యాయో తెలియని పరిస్థితిలో నేరుగా స్కూళ్లను తెరిస్తేనే విద్యార్థులకు మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే అన్నీ కేటగిరీల విద్యాసంస్థలను రీఓపెన్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే కరోనా ప్రభావం తగ్గగా.. స్కూళ్లను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి కేబినెట్‌లో వివరాలను అందించారు.

జులై 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అన్ని కేటగిరీల విద్యాసంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థతతో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. వచ్చే నెల వరకు కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోండగా.. కేసులు తగ్గి పరిస్థితులు అనుకూలంగా మారేలోపు స్కూళ్లు, కాలేజీలు అందుకు పున:ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కరోనా అదుపులోకి వస్తే వచ్చే నెల జూలైలో రోజు విడిచి రోజు పాఠశాలలు నడపాలన్నది సర్కర్ నిర్ణయంగా కూడా తెలుస్తోంది. ఈ మేరకు స్కూళ్లను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles