22 died in ‘mock drill’ at Agra’s Paras Hospital ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యం.. 22 మంది రోగుల మరణం..

Agra hospital sealed after viral video of mock drill shows patients die lack of oxygen

Paras hospital, Shri Paras Hospital Agra, oxygen drill viral video, viral video patients turn blue, oxygen supply, Covid death, agra coronavirus, Dr Arinjay Jain, Up Agra hospital oxygen supply, Agra paras hospital oxygen supply video, paras hospital Agra oxygen covid war, Covid-19, Uttar Pradesh, crime

Following widespread uproar over the alleged deaths of 22 Covid-19 patients from lack of oxygen at Shri Paras Hospital Agra, the district administration sealed the hospital on Tuesday and a case under the Epidemic Diseases Act was registered against the hospital owner for spreading misinformation.

ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యం.. 22 మంది రోగుల మరణం..

Posted: 06/08/2021 04:45 PM IST
Agra hospital sealed after viral video of mock drill shows patients die lack of oxygen

నిజం నిలకడగా బయటకొస్తుందని పెద్దలు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఆగ్రా పట్టణంలోని ఓ అసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఏకంగా 22 మంది కోవిడ్ బాధితులు మృత్యువాత పడిన ఘటనలో నిజం ఓ వీడియో రూపంలో బయటకు వచ్చింది. ఆక్సిజన్ కొరత కారణాంగా రోగులకు ప్రాణవాయువు అందకపోవడంతో వారు నానా అవస్తులు పడుతుంటే ఆసుపత్రి యాజమాన్యం మాత్రం.. మాక్ డ్రిల్ నిర్వహించి కరోనా రోగుల ప్రాణాలను బలితీసుకుంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ నిలిపివేయటంతో 22మంది రోగులు నీలిరంగులోకి మారిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రాలోని శ్రీ పరాస్ ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఆక్సిజన్ మాక్ డ్రిల్ పేరుతో ఆసుప్రతి యాజమాన్యం రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లుగా తాజాగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో సదరు ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ఏప్రిల్ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటపడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆక్సిజన్ సరఫరాను ఐదు నిమిషాల పాటు ఆపేశామని ఆసుపత్రి యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ మాటలు వీడియోలో స్పష్టంగా వినిపించిటంతో ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

పశ్చిమ యూపీలోని మోదీనగర్ లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. పేషెంట్లను తీసుకువెళ్లాలని..వారి కుటుంబ సభ్యులకు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదని అరింజయ్ మాట్లాడినట్లుగా వీడియోలో రికార్డయింది..‘మాక్ డ్రిల్’ లాంటి ఓ ప్రయోగం చేయాలనుకున్నాం. దీంతో ఏప్రిల్ 26న ఉదయం 7 గంటలకు ఆరోగ్యం విషమించిన 22 మంది రోగులకు ఆక్సిజన్ ను ఐదు నిమిషాల పాటు ఆపేశాం. వాళ్ల శరీరాలు నీలి రంగులోకి మారడం మొదలైంది. ఇక వాళ్లు బతకడం కష్టమని చెప్పామని..ఆ తరువాత మిగతా 74 మంది పేషెంట్ల కుటుంబ సభ్యులకు వెళ్లి ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకోవాలని చెప్పాం’’ అని అరింజయ్ అన్నట్లుగా వీడియోలో రికార్డయింది.

కానీ వీడియోలో ఉన్నది నా మాటలు కాదనీ.. అరింజయ్ అంటున్నారు. పరిస్థితి విషమించిన వారిని గుర్తించామని వారికి మరింత మెరుగైన చికిత్స ఇవ్వటానికే మాక్ డ్రిల్ చేశామని అంటున్నారు. ఏప్రిల్ 26న నలుగురు, మర్నాడు మరో ముగ్గురు కరోనా పేషెంట్లు చనిపోయారని చెప్పిన ఆయన ఏప్రిల్ 26న 22 మంది చనిపోయారా? అని ప్రశ్నకు మాత్రం మరణాలపై కచ్చితమైన సంఖ్య తెలియదని మాట మార్చేశారు. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావటంపై ఆగ్రా జిల్లా చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ ఆర్సీ పాండే స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారస్ అసుపత్రిలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని.. ఓ కమిటీ వేశామని తెలిపారు.

ఈ ఘటనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించిన ఆయన.. బీజేపీ పాలనలో ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదని అన్నారు. కరోనా తీవ్రత ఇలా ఉంటే కనీసం ఆక్సిజన్ కూడా అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఆక్సిజన్ కోసం పదే పదే ఫిర్యాదులు చేసినా ప్రభుత్వానికి పట్టటంలేదనీ.. కానీ రోగులకు సరిపడా ఆక్సిజన్ అందబాటులో ఉందని ప్రభుత్వం అబద్దాలు చెప్పి ప్రజల ప్రాణాలు తీస్తోందని విమర్శలు చేశారు. ప్రాణాలు నిలుపుకోవటానికి ఆసుపత్రికి వస్తే ఇంతమంది ప్రాణాలు తీసిన ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh