Ex-CS of combined AP SV Prasad dies of COVID-19 మాజీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సీఎస్ ప్రసాద్ కన్నుమూత

Ex cs of erstwhile andhra pradesh sv prasad dies due to covid 19

corona vaccine, SV Prasad, Coronavirus, Chief secretary, Yashoda Hospital, Chandrababu, YS Jagan, KCR, Andhra Pradesh, Covid-19

Former Chief Secretary (CS) of integrated Andhra Pradesh SV Prasad passed away due to COVID-19 on Tuesday. He was under treatment at a corporate hospital in Hyderabad for the last few days. As bad luck would have it, Prasad contracted the infection thrice, despite being double vaccinated against the coronavirus.

మాజీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సీఎస్ ప్రసాద్ కన్నుమూత

Posted: 06/01/2021 11:02 AM IST
Ex cs of erstwhile andhra pradesh sv prasad dies due to covid 19

కరోనా మహమ్మారి లక్షలాధి మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. రాజు-పేద, ఉన్నవారు-లేనివారు, ఆడ-మగ, పెద్దవారు-చిన్నవారు ఇలా వర్ణాలకు, వర్గాలకు, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఒకే గాడిన కడుతూ ఎందరెందరి జీవితాలనో కబళించివేస్తోంది. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న బీభత్సం వర్ణణాతీతం. మహమ్మారి విధ్వంసంతో చెల్లాచెదురైన కుటుంబాలు.. కుటుంబాల వెనుకదాగిన కన్నీటి గాధలు అన్నిఇన్నీ కావు. ఏ మృతదేహాన్ని చూసినా దాని వెనుక అవిరైన కుటుంబ ఆశలు.. చితికిపోయిన బతుకులు దాగివున్నాయి.

తాజాగా కొవిడ్ బారినపడి ఆసుపత్రిలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఆయన కుటుంబం మొత్తం మహమ్మారి బారినపడింది.దీంతో వారంతా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ప్రసాద్ పెద్ద కుమారుడు ఐసీయూలో చికిత్స పొందుతుండగా, చిన్న కుమారుడు కోలుకుంటున్నాడు. ప్రసాద్ దంపతుల ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు ఇటీవల తెలిపాయి. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన కన్నుమూశారు.

ప్రసాద్ భార్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం. ప్రసాద్ పెద్ద కుమారుడు కూడా అసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. అయితే ఆయన చిన్న కుమారుడు మాత్రం కరోనా నుంచి కోలుకున్నారు. 1975 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రసాద్ నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్‌గా కెరియర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత కడప, విశాఖపట్టణం జిల్లాల కలెక్టర్‌గానూ పనిచేశారు. అనంతరం పలు ప్రభుత్వ విభాగాలకు చైర్మన్‌గా, కార్యదర్శిగా, ముఖ్యకార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. రోశయ్య హయాంలో సీఎస్‌గా పనిచేశారు. ఆయన మరణవార్తతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులు సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles