Zomato delivery boy files case against woman యువతిపై కేసు పెట్టిన జోమాటో డెలివరీ బాయ్

Zomato delivery boy files case against bengaluru woman influencer

Zomato delivery boy lodges complaint against woman, Zomato delivery boy files complaint on woman, hitesha chandranee zomato guy, zomato, zomato guy, zomato guy viral video, zomato guy beats lady, hitesha chandranee, Delivery boy, Zomato delivery boy, delivery boy zomato, Bengaluru, Instagram, Influencer, Instagram influencer, zomato delivery boy, zomato rider, zomato, Bengaluru, Karnataka, viral video, video viral

Zomato delivery boy lodges complaint against Instagram influencer Hitesha Chandranee after he was arrested and released on bail, in the same police station where the influencer had lodged her complaint.

బెంగళూరు యువతిపై కేసు పెట్టిన జోమాటో డెలివరీ బాయ్

Posted: 03/16/2021 05:08 PM IST
Zomato delivery boy files case against bengaluru woman influencer

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో దేశవ్యాప్తంగా వార్తలో నిలిచింది. బెంగుళూరులోని ఇన్ స్ట్రాగ్రామ్ ఇన్ ఫ్లూయన్సర్ హితీష చంద్రాణీపై జోమాటో డెలివరీ బాయ్ దాడి చేశారని అమె తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు పెట్టడంతో పాటు తనకు తగిలిన గాయాలపై ఓ వీడియోను కూడా నెట్టింట్లో పెట్టడంతో అమెకు పలు వర్గాల నుంచి మద్దతు లభించి.. క్షణాల్లో ఈ వార్త దవానంలా వ్యాప్లించడంతో జోమాటో డెలివరీ బాయ్ తప్పిదాన్ని అందరూ ఎత్తిచూపారు. అయితే కొందరు మాత్రం అసలేం జరిగిందని అడిగారు.

దీంతో హితేషా చంద్రాణి తనకు సంబంధించిన కోణంలో ఘటనను వివరించింది. అయితే అసలేం జరిగిందన్న వివరాలను రెండు రోజుల తరువాత జోమాటో డెలివరీ బాయ్ అందరికీ అందుబాటులోకి వచ్చి చెప్పడంతో అసలేం జరిగిందన్న అంశంపై అందరికీ అవగాహన వచ్చింది. దీంతో డెలివరీ బాయ్ కి కూడా మద్దుతు లభించింది. తాను జోమాలో చేరి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి పిర్యాదులు లేకుండా అత్యధిక ఫైవ్ స్టార్ సర్వీసులతో రాణిస్తున్నానని..  అయితే ఈ యువతి మాత్రం తనను దుర్భాషలాడటంతో పాటు ఇష్టానుసారంగా తిట్టిపోసిందని అన్నాడు.

రోజంతా కష్టపడినా చాలీ చాలని జీతాలతో గడుపుతున్నామని, అలాంటిది అమె పార్శిల్ ను తీసుకున్న తరువాత అర్డర్ కాన్సీల్ చేసిందని, ఇలా కాన్సీల్ అయిన అర్డర్ ఫుడ్ ఫ్యాక్ అర్డర్ ను వెనక్కు ఇవ్వాల్సి వున్నా.. అది తమకు ఉచితమని.. అమె అర్డర్ ను తీసుకుని తన గదిలో డైనింగ్ టేబుల్ పై పెట్టుకుందని అన్నారు. అది ఇవ్వాలని తాను ఎంత అడిగినా ఇవ్వకుండా తనపైకి చెప్పు విసిరిందని, అది చాలదన్నట్లు తనపైకి మరో వస్తువు కూడా విసిరే క్రమంలో అమె చేతి ఉంగరమే అమె ముక్కుకు తగలి గాయమైందని అన్నారు.

ఏదీఏమైనా అమె పిర్యాదు మేరకు పోలీసులు తనను అరెస్టు చేయడంతో.. తాను చేయని నేరానికి ఎందుకు అవమానించబడ్డానని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. హితేషా చంద్రాణిపై డెలివరీ బాయ్ పోలీసులకు పిర్యాదు చేశారు. అమె ఏ పోలిస్ స్టేషన్ లో తనపై పిర్యాదు చేసిందో అదే పోలిస్ స్టేషన్ కు వెళ్లి అమెపై పిర్యాదు చేశారు. తాను ఫుడ్ డెలివరీ కోసం వస్తే తనపై ఇష్టానుసారంగా వ్రవర్తించిందని, చెప్పులు విసిరిందని. దుర్భాషలాడిందని ఆయన పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కోన్నాడు. జోమాటో డెలివరీ బాయ్ కామరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హితేషా చంద్రాణిపై ఐపీసీ 341, 355, 504 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hitesha chandranee  Delivery boy  Zomato  Instagram  Influencer  Bengaluru  Karnataka  viral video  video viral  

Other Articles