Maths, Physics no longer mandatory for engineering entry ఇంటర్ లో ఎంపీసీ తీసుకోలేదా.? అయినా బీటెక్ చదివేయోచ్చు..!

Mathematics and physics rule for engineering not mandatory aicte

All India Council for Technical Education (AICTE), National Education Policy (NEP), Mathematics, Physics, Engineering, Mandatory, AICTE, Visvesvaraya Technological University, Anil Sahasrabudhe, Anand Deshpande

The All India Council for Technical Education (AICTE) said clarifying that it was not mandatory to exclude these subjects for engineering admissions, the Council said it should be seen as a window of opportunity for universities wanting to open engineering admissions based on NEP.

ITEMVIDEOS: ఇంటర్ లో ఎంపీసీ తీసుకోలేదా.? అయినా బీటెక్ చదివేయోచ్చు..!

Posted: 03/13/2021 05:43 PM IST
Mathematics and physics rule for engineering not mandatory aicte

బీటెక్‌ చదవాలంటే ఇన్నాళ్లుగా వున్న ప్రతిబంధాకాలకు అఖిల భారత టెక్నికల్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ ఇక తొలగించింది. దీంతో ఇన్నాళ్లు ఇంటర్ లో ఎంపీసీ గ్రూపు తీసుకున్న విద్యార్థులకు మాత్రమే అందుబాటులో వున్న ఇంజనీరింగ్ విద్యా ఇకపై అగ్రికల్చర్, బిజినెస్ స్టడీస్ సహా పద్నాలుగు సబెక్టుల వారికి కూడా అందుబాటులోకి రానుంది. ఔనా.. ఇకపై ఇంజనీరింగ్ విద్యకు బోలడంత డిమాండ్ రానుంది. ఇంటర్ వొకేషనల్ కోర్సు చదివినవారైనా ఇక ఇంజనీరింగ్ విద్యలో చేరే అవకాశాలను ఏఐసీటీఈ కల్పించింది.

ఇన్నాళ్లు ఇంటర్ లో  గణితం తప్పనిసరిగా ఎంచుకున్న విద్యార్థులకు మాత్రమే అందుబాటులో వున్న ఇంజనీరింగ్ విద్య ఇకపై మరింత మందికి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఖిల భారత టెక్నికల్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ (ఏఐసీటీఈ) నిబంధనలు మార్చింది. వచ్చే విద్యా సంవత్సరానికి వృత్తి విద్యా కళాశాలల అనుమతులకు సంబంధించి విడుదల చేసిన హ్యాండ్ బుక్‌-2021లో బీటెక్‌ చదివేందుకు అర్హతలను పేర్కొంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు మాత్రం తప్పనిసరి.

ఏఐసీటీఈ పేర్కొన్న 14 సబ్జెక్టులు భౌతికశాస్త్రం, గణితం, రసాయనశాస్త్రం, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, జీవశాస్త్రం, ఇన్ఫర్‌మేటిక్స్‌ ప్రాక్టీసెస్‌, బయోటెక్నాలజీ, టెక్నికల్‌ ఒకేషనల్‌ సబ్జెక్టు, అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ గ్రాఫిక్స్‌, బిజినెస్‌ స్టడీస్‌, ఎంటర్ప్రెన్యూర్ షిప్‌లలో ఏ మూడు సబెక్టులు ఇంటర్ లో చదివి పాసై ఉన్నా ఇంజనీరింగ్ (బీటెక్‌) చదవుకు అర్హులని అఖిల భారత టెక్నికల్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ తమ నూతన హ్యాండ్ బుక్ లో పేర్కోంది. అయితే ఇంజినీరింగ్ లో ఆశించిన ఫలితాలు సాధించేందుకు అవసరమైన గణితం, భౌతికశాస్త్రం, ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌ లాంటి సబ్జెక్టుల్లో బ్రిడ్జి కోర్సులను అందించాలని ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఏఐసీటీఈ సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles