పోలీసులకు మూడు రోజుల పాటు కంటిమీద కునుకు కరువయ్యేలా చేసిన ఘట్ కేసర్ బీ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన కేసును చేధిస్తున్న రాచకోండ పోలీసులకు అమె కేసు దర్యాప్తులో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. తనను అటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని యువతి డ్రామాలు ఆడి కలకలం రేపిన ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 13 వరకు తేదీ వరకు అసుపత్రిలోనే వున్న యువతి.. ఆ తరువాత పది రోజుల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే అమె పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం అందుకు భిన్నమైన కారణాలు వెలుగుచేస్తున్నాయి.
తల్లిదండ్రుల కథనం ప్రకారం యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని పేర్కోన్నా.. పోలీసులకు వైద్యవర్గాలు అందించిన పోస్టుమార్టం నివేదికలో మాత్రం అమె మరణం పేగులు, కాలేయం దెబ్బతినడం వల్లే జరిగినట్లు ప్రాథమిక నివేదిక స్పష్టం చేస్తుందని తెలుస్తుంది. దీంతో బీ ఫార్మా విద్యార్థిని ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతిగానే నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామూహిక అత్యాచారం, అపహరణ డ్రామా ఆడినందుకు తన పరువుపోయిందన్న యోచనలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పేర్కోంటున్నారు. కాగా పోస్టుమార్గం నివేదిక మరో విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేసినా ఇంకా స్పష్టతరాలేదని చెప్పారు.
కిడ్నాప్ డ్రామా ఆడిన అనంతరం ఆ విద్యార్థిని అసుపత్రి నుంచి నేరుగా అమెను తన మేనమామ ఇంటికి తీసుకెళ్లిన తరువాత.. అక్కడ అమెకు సరిగ్గా ఆహారం తీసుకోలేదని తెలిసింది. అంతేగాక, ఆమెను కొన్ని రోజులుగా చీకట్లో ఉంచి ఆమె తల్లిదండ్రులు 11 రోజులు పూజలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆమె పేగులు, కాలేయం దెబ్బతిందని, అందుకే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. కాగా, విద్యార్థిని తన తండ్రి మధుమేహం, బీపీ మాత్రలను అతిగా వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అమె తల్లిదండ్రులు చెబుతున్నారు.
విద్యార్థిని నోటి వద్ద నురగలు కనపడడం, స్పృహ లేకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ఆమె అమ్మమ్మ ఇంటివద్ద విద్యార్థిని అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మహత్య కేసులో మరిన్ని విషయాలను తేల్చడానికి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అమె ఆత్మహత్యకు పాల్పడిందా.? లేక ఇది హత్య అన్న కోణంలోనూ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more