TV Reporter Robbed at Gunpoint Live on Air గన్ పాయింట్ లో టీవీ రిపోర్టర్.. సిబ్బంది దోపిడీ

Tv reporter robbed at gunpoint live on air in broad daylight shocking video goes viral

TV Reporter Robbed at Gunpoint Live, Reporter Robbed at Gunpoint, Ecuador reporter robbed live, TV journalist robbed live, TV crew robbed live, Diego Ordinola, Ecuador, Gun, gunpoint robbery, Live TV, TV reporter, viral video, Crime

A shocking video is going viral on social media showing a TV reporter and his crew being robbed at gunpoint during a live broadcast in Ecuador. The incident which happened on February 12 shows a gun-wielding robber outside a football stadium, demanding the reporter and the TV crew to hand their cash over to him.

ITEMVIDEOS: లైవ్ షో మధ్య గన్ పాయింట్ లో టీవీ రిపోర్టర్.. సిబ్బంది దోపిడీ

Posted: 02/20/2021 12:01 PM IST
Tv reporter robbed at gunpoint live on air in broad daylight shocking video goes viral

ఈ మధ్యకాలంలో ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య ప్రజాసమస్యలను ఎలుగెత్తి చాటుతున్న మీడియా జర్నలిస్టులను వారుధులుగా గుర్తించని వారు ఎక్కువగానే వున్నారు. ఆ మాట అటుంచితే.. ఇక వీరిని టార్గెట్ చేసుకునే దొంగల సంఖ్య కూడా అధికం అవుతోంది. మొన్నామధ్య అర్జెంటీనా టీవీ రిపోర్టర్ లైవ్ షోకు సిద్దమవుతుండగా, ఓ అగంతకుడు రిపోర్టర్ ఫోన్ ను అందుకుని పలాయనం చిత్తగించిన ఘటన చోటుచేసుకుంది. అంతకుముందు ఓ మహిళా జర్నలిస్ట్ లైవ్ షో చేస్తుండగా, ఓ అగంతకుడు అమెకు చుంబనం ఇచ్చి వెళ్లి కటకటాల పాలైన విషయం కూడా తెలిసిందే.

తాజాగా మరో ఘటనలో లైవ్ షో కొనసాగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన ఓ ఘరానా దొంగ టీవీ ఛానెల్‌ సిబ్బంది, విలేకర్లను దోచేసి తుర్రుమన్నాడు. ఈక్వెడార్ లో చోటుచేసుకున్న ఈ షాకింగ్‌ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనమైంది. పట్టపగలు, బహిరంగంగా వారిని తుపాకీతో బెదిరించి.. వారి వద్దనున్న డబ్బు, వస్తువులు దోచుకోవటం అందులో చూడొచ్చు. ఎంత త్వరగా దోచేశాడో అంతే త్వరగా అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే అతనికోసం వేచి చూస్తున్న మరో ఇద్దరు మిత్రుడితో కలసి బైక్ పై జారుకున్నాడు.

వివరా్లలోకి వెళ్తే.. డైరెక్ట్‌ టీవీ స్పోర్ట్స్‌ అనే క్రీడా ఛానెల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్న డిగో ఆర్డినోలా తన టీవీ ఛానెల్ సిబ్బందితో ఓ పుట్ బాల్ స్టేడియం వద్దకు చేరుకున్నాడు. ఈక్వాడార్ లోని గువాయాక్విల్‌ పట్టణంలోని పుట్ బాల్ స్టేడియం వద్దనున్న ఎస్డాడియో మాన్యుమెంటల్‌ భవనం ఎదుట.. ఫుట్ బాల్ మ్యాచ్ పై విశ్లేషణ అందిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో లైవ్ లో వెళ్తుండగా.. ఓ దొంగ ఆ ప్రసారానికి అడ్డువచ్చాడు. మాస్క్‌ ధరించిన అతను ఆర్డినోలా వైపు రివ్వాల్వర్‌ గురిపెట్టాడు. మైక్రోఫోన్ ను లాగేసి  ‘‘టెలిఫోన్‌’’ అంటూ అరిచి దానిని సొంతం చేసుకున్నాడు.

అనంతరం అక్కడున్న మిగిలిన సిబ్బంది వైపు తుపాకీ గురిపెట్టి వారి ఫోన్లు, పర్సులు కూడా తీసుకున్నాడు. ఈ ఘటన అంతా కెమేరాలో రికార్డయింది. ఆ తర్వాత  రోడ్డువైపు పరిగెత్తిన దొంగ .. అక్కడ సిద్ధంగా ఉన్న మోటార్‌ సైకిల్‌ వెనుక కూర్చుని ఉడాయించాడు. ‘‘మేము కనీసం ప్రశాంతంగా పని కూడా చేసుకోలేకపోతున్నాము. ఇది మధ్యాహ్నం 1:00 గంటకు మాన్యుమెంటల్‌ స్టేడియం వెలుపల జరిగింది.’’ అంటూ ఆ విలేకరి సామాజిక మాధ్యమాల్లో వాపోయాడు. కాగా పోలీసులు ఆ దొంగను పట్టుకుంటామని హామీ ఇచ్చారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diego Ordinola  Ecuador  gun  gunpoint  robbery  live tv  TV Reporter  viral video  Crime  

Other Articles

Today on Telugu Wishesh