RBI puts Rs 1,000 withdrawal cap on Deccan Urban Co-op Bank మళ్లీ నగదు విత్ డ్రాపై ఆర్బీఐ ఆంక్షలు.. రూ.1000 వరకే ఉపసంహరణ

Deccan urban co operative bank rbi puts rs 1 000 withdrawal cap for 6 months

deccan urban co-operative bank, reserve bank of india, Restrictions, Savings Account, Withdrawal limit, Karnataka, fresh loans,Reserve Bank, deccan urban co-op bank, RBI, DICGC, deposits industry news, industry growth, indian industry news, Indian Economy, Finance

Reserve Bank said it has barred Karnataka-based Deccan Urban Co-operative Bank Ltd from granting fresh loans or accepting deposits and customers cannot withdraw more than Rs 1,000 from their savings account for a period of six months. The lender has also been asked not to make fresh investments or incur any liability without its prior permission.

మళ్లీ నగదు విత్ డ్రాపై ఆర్బీఐ ఆంక్షలు.. రూ.1000 వరకే ఉపసంహరణ

Posted: 02/20/2021 10:59 AM IST
Deccan urban co operative bank rbi puts rs 1 000 withdrawal cap for 6 months

నగదు ఉపసంహరణపై మళ్లీ అంక్షలను విధించింది భారతీయ రిజర్వు బ్యాంకు. కేవలం రూ.1000 మాత్రమే విత్ డ్రా చేసుకునేలా పరిమితులను విధించింది. అంతేకాదు కొత్త రుణాలు, నగదు డిపాజిట్లపై కూడా ఆంక్షలను విధించింది. ఇదేంటి మళ్లీ నోట్ల బదిలీ నాటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది అన్ని బ్యాంకులకు వర్తించడం లేదు. కేవలం కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్‌ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ కు మాత్రమే వర్తించనుంది. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) ఆంక్షలు విధించింది.

ఈ బ్యాంకులోని ఖాతాదారులు కేవలం రూ.1,000 మాత్రమే నగదు విత్ డ్రా చేసుకునేలా పరిమితి విధించింది. దీంతో పాటు ఇకపై బ్యాంకు అధికారులు కూడా ఎవరికీ కొత్తగా రుణాలు ఇవ్వడం, ఎవరి వద్ద నుంచి నగదు డిపాజిట్లు జమ చేసుకోవద్దని అర్బీఐ అదేశాలను జారి చేసింది. అంతేకాదు బ్యాంకు అధికారులు నిధులు సమీకరించుకునే చర్యలతో పాటు కొత్తగా ఎక్కడా పెట్టుబడులు కూడా పెట్టొద్దని అదేశాల్లో పేర్కోంది. ఈ మేరకు ఆర్బీఐ.. బ్యాంకు సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు పేరిట ఉన్న ఆస్తుల్ని కూడా విక్రయించొద్దని స్పష్టం చేసింది. ఎలాంటి చెల్లింపులు కూడా చేయొద్దని ఆదేశించింది.

తాము జారీ చేసిన ఆంక్షలు ఈ నెల 19 నుంచి అమల్లోకి వస్తాయని, ఇవి ఆరు మాసాల పాటు అమల్లో కొనసాగుతాయని అర్బీఐ వెల్లడించింది. బ్యాంకు అర్థిక పరిస్థితి మెరుగయ్యే కోద్దీ ఆంక్షలను సడలిస్తామని అర్బీఐ తెలిపింది. అయితే, బ్యాంకు ఖాతాదారుల్లో 99.58 శాతం మంది ఖాతాదారులు ‘డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కోఆపరేషన్‌(డీఐసీజీసీ)’ కింద నమోదై ఉన్నారని.. వారందరికీ బీమా రూపంలో భద్రత లభిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఆంక్షలు విధించినంత మాత్రాన బ్యాంకు లైసెన్స్‌ రద్దు చేసినట్లు కాదని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు కొన్ని పరిమితులు కొనసాగుతాయని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles