Kolkata Couple Designs Menu Like an Aadhaar Card డిజిటల్ ఇండియాను ఇలా ప్రమోట్ చేసిన కోసం కొత్త జంట

Kolkata couple designs wedding s food menu like an aadhaar card

Gogol Saha, Subarna Das, aadhaar card, wedding card, wedding food menu, Digital India, Wedding guests, Rajarhat, Kolkata

The couple's idea went viral after the photos were shared on other social media platforms as well. The couple, identified as Kolkata's Rajarhat area's Gogol Saha and Subarna Das, while speaking to an online portal, said they were excited to see that their unique idea has become viral and people have been talking about it.

పెళ్లిలో డిజిటల్ ఇండియాను ప్రమోట్ చేసిన కొత్త జంట

Posted: 02/05/2021 11:46 AM IST
Kolkata couple designs wedding s food menu like an aadhaar card

యుక్తవయస్సు వచ్చిన తరువాత అందరూ తమకు నచ్చిన భాగస్వామనికి ఎంచుకుని వివాహాలు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే అందరిలా కాకుండా కొందరు మాత్రం తమ పెళ్లిని విభిన్నంగా చేసుకుంటారు. ఇక కొందరు తమ పెళ్లి ఖర్చులను తగ్గించుకుని అదే డబ్బును పేదలకు వినియోగించడం కూడా చూస్తుంటాం. కానీ ఈ కొత్త జంట మాత్రం తమ పెళ్లి చిరకాలం గుర్తుండిపోవాలని వినూత్నంగా అలోచించారు. తమ పెళ్లిలో అతిధులకు అందించే బోజనంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా.. తమ పెళ్లి కూడా అంగరంగవైభంగానే జరుపుకున్న ఈ జంట ఒక్క చిన్న అలోచనతో తాము అనుకున్నది సాధించారు.

జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం వివాహం కాబట్టి శక్తిమేర ఘనంగా జరుపుకోవాలని భావిస్తుంటారు. కొందరు తమ పెళ్లి విభిన్నంగా ఉండాలని అనుకుంటారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ జంట కూడా ఈ కోవలోకే వస్తుంది. కోల్ కతా రాజర్ హాట్ ఏరియాకు చెందిన గోగోల్ సాహా, సువర్ణ దాస్ ల పెళ్లి ఫిబ్రవరి 1న జరిగింది. వీరి పెళ్లి విందుకు ఏర్పాటు చేసిన మెనూ కార్డును చూడగానే ఆధార్ కార్డు అని భావిస్తే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే, ఆ మెనూ కార్డును అచ్చం ఆధార్ కార్డు తరహాలోనే రూపొందించారు.

ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేరకు డిజిటల్ ఇండియా కార్యాచరణను ఎంతగానో ఇష్టపడే వధూవరులు గోగోల్, సువర్ణ తమ పెళ్లిలో ఆధార్ ను పోలిన మెనూ కార్డు డిజైన్ చేయించారు. ప్రతి డైనింగ్ టేబుల్ వద్ద ఈ మెనూ కార్డులను చూసి ఆధార్ కార్డులని భ్రమించడం పెళ్లికి విచ్చేసిన అతిథుల వంతైంది. దీనిపై పెళ్లికొడుకు గోగోల్ మాట్లాడుతూ, ఈ ఆలోచన తన భార్య సువర్ణదేనని తెలిపాడు. డిజిటల్ ఇండియాపై ప్రజల్లో అవగాహన కలిగించడం కోసమే మెనూ కార్డులను ఆధార్ తరహాలో తయారు చేయించామని చెప్పాడు. పెళ్లికి వచ్చిన వారందరూ దీని గురించి మాట్లాడుకున్నారని, దాంతో తమ ఉద్దేశం నెరవేరిందని భావిస్తున్నామని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles