Different variant of Covid prevalent in Telugu States తెలుగు రాష్ట్రాల్లో విభిన్న కరోనా.. ఎన్440కెగా నామకరణం..

Ccmb study reveals different variant of covid prevalent in south india

Coronavirus, SARS-CoV-2, CSIR-Centre for Cellular and Molecular Biology, CSIR-CCMB, CCMD director, Rakesh Mishra, different variant of Covid-19, south India, Telugu States

Scientists at the CSIR-Centre for Cellular and Molecular Biology here have found prominently a different variant of SARS-CoV-2 in southern parts of India, a top official of the institute said.

తెలుగు రాష్ట్రాల్లో విభిన్న కరోనా.. ఎన్440కెగా నామకరణం..

Posted: 01/29/2021 03:04 PM IST
Ccmb study reveals different variant of covid prevalent in south india

బ్రిటన్ లో కరోనా మహమ్మారి కొత్త రూపు దాల్చి అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చాటుతూ వేలాది మంది ప్రాణాలను బలితీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా అందోళన రేకెత్తుతోంది. కరోనా మహమ్మారి నియంత్రణకు వాక్సీన్ వచ్చిన క్రమంలో అది కొత్త రూపు సంతరించుకోవడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో కొత్త స్ట్రెయిన్ వుందా.? లేదా అన్న పరిశోధనలను ప్రారంభించాయి, ఇక ఈ నేపథ్యంలో భారత్ లో కొత్త స్ట్రెయిన్ పై అధ్యయానాలు జరుగుతున్న క్రమంలో మరో విభిన్నమైన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినట్లు పరిశోధనల్లో వెల్లడైంది.

సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలో సీఐఎస్ఆర్ నిర్వహించిన అద్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. కరోనా వైరస్ లోని పలు రకాల వైరస్ కన్నా ఇది బలహీనంగానే వుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. దీనిని ఎన్ 440కె గా నామకరణం చేసినట్టు తెలిపారు. శంలో ఈ రకం వైరస్‌ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో నిర్ధారించేందుకు పరిశోధనను ముమ్మరం చేయనున్నట్లు వివరించారు. ఈ తరహా కరోనా వైరస్ దక్షణాధి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోందని.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికంగా కనిపిస్తోందని అన్నారు.

కాగా, ఇది పూర్తిగా కోత్త రకం కాదని, కొంతకాలంగా వ్యాప్తిలో ఉంది. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో స్వల్ప కేసుల్లోనూ ఎన్440 కె కరోనా వైరస్ కనిపించిందని అన్నారు. అయితే ప్రస్తుతం ఎక్కువ మందికి ఈ తరహా వైరస్ వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ఎన్‌440కే రకం కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు పెద్దగా ఉండటం లేదని అన్నారు. స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయి. మునుపటి వైరస్‌ బలహీనపడి ఉండటంతో ఇది ఉత్పన్నమై ఉండొచ్చునని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ రకంపై కరోనాపై తమ వద్ద పెద్దగా డేటా అందుబాటులో లేదన్న ఆయన రానున్న రోజుల్లో భారీ స్థాయిలో వైరస్‌ జన్యుక్రమాలను ఆవిష్కరించి, మరిన్ని వివరాలు వెలుగులోకి తెస్తామని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles