First doses of Covid vaccine arrive in Hyderabad హైదరాబాద్ చేరుకున్న తొలి విడత కరోనా వాక్సీన్

First consignment of covid vaccines land in hyderabad amid prayers hopes

Serum Institute of India, hyderabad, government of india, district collectors, covishield, covid-19 vaccine, Bharat Biotech, Covaxin, Director Public Health, Hyderabad, Telangana

The much-awaited moment finally arrived as the first consignment of Covid-19 vaccine for Telangana reached Hyderabad amid prayers and hopes of an early end to the pandemic. Priests of various religious faiths offered prayers as the state received 3.64 lakh doses of Oxford-Astrazeneca's Covishield vaccine.

హైదరాబాద్ చేరుకున్న తొలి విడత కరోనా వాక్సీన్..

Posted: 01/12/2021 08:58 PM IST
First consignment of covid vaccines land in hyderabad amid prayers hopes

కరోనా మహమ్మారిని నియంత్రించే శక్తి కలిగిన కరోనా వ్యాక్సిన్ తెలంగాణకు చేరకుంది. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్ లతో బయలుదేరిన ప్రత్యేక విమానం నేరుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరకుంది. ఈ విమానంలో తొలి విడతకు సంబంధించిన 31 బాక్సుల్లో 3.72 లక్షల వ్యాక్సిన్‌ డోసులు నగరానికి చేరకున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆ బాక్సులను కోఠిలోని ప్రభుత్వ అరోగ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శీతలీకరణ కేంద్రానికి తరలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 44 క్యూబిక్ మీటర్ల వ్యాక్సిన్ కూలర్ లో వాటిని నిల్వ చేశారు.

శంషాబాద్ నుంచి ప్రత్యేక కంటైనర్లలో కోఠికి చేరకున్న వాక్సీన్ డోసులను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ కోఠి ప్రభుత్వ అరోగ్య కేంద్రానికి తరలించారు. సంక్రాంతి పర్వదినం తరువాత ఈనెల 16వ తేదీ నుంచి వాక్సీన్ డోసులను జిల్లాలకు తరలించనున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్ ను తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. తొలుత 2.90 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బంది, పోలీసులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి టీకా వేయబోతున్నారు.

అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలను అన్ని జిల్లాలలో ఏర్పాట్ల చేశారు. కరోనా సమయంలో ముందుండి పోరాడే సైనికులుగా నిలిచిన వైద్య అరోగ్య సిబ్బంది, పోలీసు యంత్రాంగం, హెల్త్ వర్కర్లు, పారిశుధ్య సిబ్బందికి తొలి విడత డోసులను అందించనున్నామని రాష్ట్ర ప్రభుత్వం ముందునుంచీ చెబతోంది. వీరితో పాటు రక్తపోటు, మధుమేహం వ్యాధులతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న రోగులతో పాటు 50 ఏళ్లు పైబడిన వారికి కూడా కరోనా టీకాను తొలి విడతలో భాగంగానే అందించనున్నామని కేంద్రం తెలిపింది. అయితే రాష్ట్రానికి అందిన డోసుల నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ తరువాతే మిగిలిన వారికి ఇవ్వనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles