చీటింగ్ కేసులో నటి రాధిక కుమారస్వామి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఎదుట ప్రశ్నించారు, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపి పెట్టిన కేసులో ప్రధాన నిందితుడికి, రాధిక మధ్య అక్రమంగా పెద్ద ఎత్తున నగదు బదిలీ అయిందన్న ఆరోపణలపై సీసీబీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. తన సోదరుడు రవిరాజ్ తో కలిసి చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి చేరుకున్న రాధికను అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. జైలులో రిమాండ్ ఖైదీగా వున్న నిందితుడితో జరిపిన లావాదేవీలతో పాటు అతడితో పరిచయం ఎలా జరిగింది..? అన్న వివరాలను సైతం పోలీసులు ఈ సందర్భంగా తెలుసుకున్నారు,
తనకు తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, జోతిష్యుడిగా, వాస్తు నిఫుణిడిగా పేర్కోన్న యువరాజ్ (52) ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అనేక మంది నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు గతేడాది డిసెంబరులో యువరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు నటి రాధిక కుమారస్వామి, యువరాజ్ మధ్య రూ. 75 లక్షల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. దీంతో ఆమెను విచారించేందుకు సమన్లు జారీ చేశారు. సీసీబీ దర్యాప్తునకు హాజరైన రాధిక అనంతరం మాట్లాడుతూ..ఓ సినిమాకు సంబంధించి తన ఖాతాలో రూ. 60 లక్షలు జమ అయినట్టు చెప్పారు.
అయితే, ఆ సినిమా బృందంతో ఎలాంటి ముందస్తు ఒప్పందం లేకపోవడంతో ఆ డబ్బును వెనక్కి పంపించినట్టు చెప్పారు. అంతకుముందు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యువరాజ్ తనకు గత 17 ఏళ్లుగా తెలుసన్నారు. ఆయన తమ కుటుంబ జ్యోతిష్యుడని చెప్పారు. తన కెరియర్, జీవితం, తన తండ్రి మరణం గురించి ఆయన చెప్పినవన్నీ నిజమయ్యాయని పేర్కొన్నారు. అతడంటే తనకు ఎంతో విశ్వాసమని, గతేడాది అతడి అరెస్ట్ విషయం తెలిసి షాకయ్యానని పేర్కొన్నారు. కాగా, గతేడాది డిసెంబరు 16న యువరాజ్ నివాసంపై దాడులు చేసిన సీసీబీ అధికారులు రూ. 91 కోట్ల విలువైన 100 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.
యువరాజ్ కు సొంత ప్రొడక్షన్ కంపెనీ ఉందని, ఓ చారిత్రక సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని తనను అడిగారని రాధిక తెలిపారు. తాను వెంటనే అంగీకరించానని చెప్పారు. దీంతో అడ్వాన్స్‌గా రూ. 15 లక్షలు పంపిస్తానని చెప్పి తన ఖాతాలోకి బదిలీ చేశారని వివరించారు. మిగతా సొమ్ము గురించి ప్రశ్నించగా, యువరాజ్ బావమరిది ఖాతా నుంచి మరో రూ. 60 లక్షలు తన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయినట్టు రాధికా కుమారస్వామి వివరించారు. సినిమాకు సంబంధించిన లావాదేవీలు జరిగాయని.. అంతేకానీ మరేమీ కాదని పేర్కోన్నారు, కాగా, ఈ కేసులో ఈడీ, ఐటీ అధికారులు కూడా రాధికను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more