Country made bomb explosion in Tirupati రేణిగుంట రైలు పట్టాలపై బాంబు.. తప్పిన ఘోరం..

A woman injured in a country made bomb explosion in tirupati

Country made bomb blast, bomb blast Renigunta Railway Station, Shepherd, Injury, Railway Track, Box, Bomb blast, Renigunta Railway Station, Chittoor, AndhraPradesh, Crime

A woman was injured in a Country made bomb blast on Tuesday evening near railway track in Renigunta Mandal of Chittoor District. According to Renigunta CI Anjuyadhav, a shepherd Sasikala of Tarakarama Nagar noticed a box near the railway track and tried to open that box by a stick during that time the country-made bomb was blasted.

రేణిగుంట రైలు పట్టాలపై బాంబు.. తప్పిన పెను ప్రమాదం..

Posted: 12/08/2020 10:11 PM IST
A woman injured in a country made bomb explosion in tirupati

(Image source from: Thehansindia.com)

ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట జంక్షన్ సమీపంలోని రైల్వే ట్రాక్ పై పెను ప్రమాదం తప్పిపోయింది. ఓ పశువుల కాపరి తాను గాయపడి., ఆ మార్గం గుండా వచ్చే రైళ్లకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా చేసింది. రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని పట్టాలపై బాంబు భారీ విస్పోటనంతో సంభవించిన పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా ఉల్లిక్కిపడి పోలీసులకు సమాచారాన్ని అందించారు. రేణిగుంట పోలీసులు, రైల్వే పోలీసులు, బాంబు స్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు సంభవించడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. అంతేకాదు క్లూస్ టీం కూడా రంగంలోకి దిగి బాంబు పేలుడులో వినియోగించిన పధార్థాలను పరిశీలిస్తున్నారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రేణిగుంట సిఐ అంజు యాదవ్.. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు ఆయన తెలిపిన కథనం ప్రకారం.. రేణిగుంట రైల్వే ట్రాకుపై ఓ నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రేణిగుంట రైల్వే స్టేషన్ పరిదిలోని రైల్వే ట్రాక్ పరిసరాల్లోని స్థానిక తారకరామా నగర్ కాలనీలో నివసించే శశికళ అనే మహిళ నిత్యం మాధిరిగానే ఇవాళ కూడా పశువులను మేపడానికి వచ్చింది. అలా మేపుతూ రాగా ఓ చోట అమె ఓ డబ్బాను గుర్తించింది. అయితే డబ్బాను చూసినా దానిని చేతులతో తీసే ధైర్యం చేయని శశికళ.. తన చేతిలో ఉన్న కర్రతో ముందుగా ఆ డబ్బాను కదిలించింది.

అంతే భారీ శబ్ధంతో పెద్ద విస్పోటనం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో శశికళ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చేతివేళ్లు సహా కుడిచేయి భాగం అంతా ఛిద్రమై తీవ్ర రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న జిఆర్ పి, పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబు పేలినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పేలుడు పదార్థాన్ని పరీక్ష నిమిత్తం పంపామని నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles