White goods set to get costlier by up to 20% కన్జూమర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ధరలకు రెక్కలు..

White goods electronic items set to get costlier by up to 20 percent

white goods, electronics, home appliances, washing machines, refrigerators, consumer goods, Micro-ovens, Copper, zinc, aluminum, steel, plastic, foaming agents, commerce, business, economy

Prices of televisions, refrigerators, washing machines, air-conditioners and microwave ovens are set rise by up to 20% this month due to a 15-40% increase in input costs, making it among the biggest one-shot hikes, industry executives said. Copper, zinc, aluminum, steel, plastic and foaming agents have become dearer, while ocean freight costs have risen 40-50%, they said.

న్యూఇయర్ వడ్డింపు టీవీ ఫ్రిడ్జ్ ఏసీ సహా ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ ప్రియం..

Posted: 12/09/2020 11:55 AM IST
White goods electronic items set to get costlier by up to 20 percent

ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.? అయితే నెలసరి వాయిదాల్లోనైనా పర్వాలేదు కానీ వెంటనే కొనేయండీ.. ఎందుకంటే ఇకపై ఆ వస్తువులు కొనాలంటే ఏకంగా 25 నుంచి 30 శాతం మేర ధరను అధికంగా వెచ్చించాల్సి వస్తుంది. అదేంటీ అంతలా ధరలు ఎందుకు పెరుగుతాయ్.. అన్న సందేహాలు రేగుతున్నాయా.? నిజమేనండీ ఎలక్ట్రానిక్ వస్తువుల ముడిసరుకుల రేట్లు (ఇన్‌పుట్ కాస్ట్స్) 15 నుంచి 40 శాతం మధ్య పెరగడంతో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ధరలు కూడా ఇక పెరగక తప్పడం లేదు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రో ఓవెన్ల వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు దాదాపు 25 నుంచి 40 శాతం పెరగనున్నాయి.

ఎందుకిలా అంటే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ లో వినియోగించే ముడిసరుకులైన కాపర్, జింక్‌, అల్యూమినియం, స్టీల్‌, ప్లాస్టిక్‌ వంటి వాటి రేట్లు పెరిగాయని, వీటి షిప్ మెంట్ చార్జీలు కూడా పెరిగాయని దీంతో ధరలు పెరుగుదల అనివార్యమని అంటున్నారు నిపుణులు. అలాగే, టీవీ‌ ప్యానెళ్ల ధరలు 30 నుంచి 100 శాతం మధ్య పెరిగినట్లు వివరించారు. గ్లోబల్ మార్కెట్లో వీటి కొరత ఉండడంతో ఈ పరిస్థితి ఉందని చెప్పారు. భారత్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయా సంస్థలకు ముందే తెలిసినప్పటికీ పండుగ సీజన్‌లో ఉండే గిరాకీని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ధరలను పెంచకుండా వాయిదా వేస్తూ వస్తున్నాయని తెలిపారు.

వచ్చే ఏడాది జనవరి నుంచి ఎలక్ట్రానిక్ కంపెనీలు ధరలు పెంపుకు శ్రీకారం చుట్టనున్నాయని, జనవరి నుంచి పెంచి ధరలతోనే విక్రయాలు సాగనున్నాయని ఓ నిపుణుడు తెలిపారు. ఏళ్ల తరువాత గణనీయంగా ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించనుందని వివరించారు. వాషింగ్ మిషన్లు, ఏసీలు 8 నుంచి 10 శాతం, రిఫ్రిజిరేజర్లు, చెస్ట్ ఫ్రీజర్లు 12 నుంచి 15 శాతం, టెలివిజన్ ధరలు 7 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో వినియోగించే కాపర్, జింక్, అల్యూమినియం ధరలు గత నాలుగు నెలలగా ఏకంగా 40-45 శాతం మేర పెరిగాయని అయినా పండగ నేపథ్యంలో ధరలను పెంచడం భావ్యం కాదని మిన్నకుండిపోయినట్టు చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles