Andhra must give instant monetary relief to farmers: Pawan Kalyan రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: పవన్ కల్యాణ్

Pawan kalyan urges andhra govt to pay rs 30000 per acre to cyclone nivar hit farmers

Cyclone Nivar, Pawan Kalyan, Jana Sena, YSRCP Govt, YS Jagan, Nadella Manohar, tenant farmers benefits, Jai Kisan program, tenant farmers, tirupati, Chittor, Andhra Pradesh, Politics

Janasena party founder Pawan Kalyan after visiting a few Nivar affected villages, today in tirupati janasenani demanded that the state government should give an immediate token monetary relief of Rs 5,000 or Rs 10,000 per acre to the farmers hit by the cyclonic storm

రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: పవన్ కల్యాణ్

Posted: 12/03/2020 11:55 PM IST
Pawan kalyan urges andhra govt to pay rs 30000 per acre to cyclone nivar hit farmers

కోస్తాంధ్ర, తీరప్రాంతంపై నిత్యం తుపాన్లు విరుచుకుపడుతున్నాయని.. ఈ ప్రకృతి విలయాన్ని నిత్యం అధిగమిస్తూ అక్కడి రైతులు పంటలు పడింస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రైతులలో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా వుందని, అకాల వర్షాలు, ప్రకృతి ప్రకోపాల సమయంలో వారిని అదుకునేందుకు.. మనోధైర్యం నింపేందుకు ప్రభుత్వ పరిహారాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు, ప్రకృతి వైపరిత్యాన్ని ఎదుర్కోని.. రైతులు ఆరుగాలం శ్రమించి చిందించే చమటే సేద్యంగా మారినా.. అది చేతికందే వరకు దానిని కాపాడుకుంటూ వస్తున్నాడని.. వైపరిత్యాలు చోటుచేసుకున్న సమయంలో వారిని ప్రభుత్వాలు అదుకోవాల్సిన అవసరం కూడా వుందని అన్నారు.

అయితే నివర్ తుపాను తీర ప్రాంత రైతన్నను నిట్టనిలువునా ముంచిన నేపథ్యంలో ఆపన్నహస్తం అందించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు, తుపాన్ వల్ల పంటను కోల్పోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, ప్రతి రైతుకు రూ. 35 వేల వంతున నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. జైకిసాన్ పేరుతో త్వరలోనే ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. రైతులకు అండగా ఉండేలా ఓ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. దళారీ వ్యవస్థ వల్ల రైతులు చాలా నష్టపోతున్నారని, ఆ వ్యవస్థను నిర్మూలించి రైతులకు లాభసాటి ధర వచ్చేలా కార్యాచరణను సిద్ధం చేస్తామని చెప్పారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని పవన్ విమర్శించారు.

రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. రైతులకు రావాల్సింది గిట్టుబాటు ధర కాదని, లాభసాటి ధర అని అన్నారు. పంట నష్టంపై నివేదిక తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలు, హస్తినలో రైతుల ఆందోళనలపై స్పందించిన ఆయన రైతుల మేలు కోసమే బీజేపీ సర్కారు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. రైతులను బలోపేతం చేయడానికే మోదీ ఈ చట్టాలను తీసుకొచ్చారని అన్నారు. చట్టాల్లో లోటుపాట్లు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని చెప్పారు. చట్టాల సవరణకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles