GHMC Elections: Voting Underway Amid Tight Security మందకొడిగా సాగుతున్న జీహెచ్ఎంసీ పోలింగ్..

Ghmc elections voting underway in a slow nod amid tight security

GHMC Elections, GHMC Elections, slow voting rate, Covid-19 scare, Bandi Sanjay, KTR, CM KCR, BJP, Congress, TDP, GHMC Elections voting, GHMC polling underway, GHMC Election officials mistake, SEC blunder mistake, GHMC Election Campaign, Greater Hyderabad Elections, BJP, Hyderabad, Telangana, Politics

The voting for Greater Hyderabad Municipal Corporation (GHMC) polls are underway amid tight security on tuesday. The voting started at 7 AM and will conclude at 6 PM. The voting will be conducted at 150 divisions. Elaborate arrangements have been made to conduct the polls in a free and fair manner.

జీహెచ్ఎంసీ ఎన్నికలు: మందకొడిగా సాగుతున్న పోలింగ్.. పోలీసుల అభ్యర్థన

Posted: 12/01/2020 10:13 AM IST
Ghmc elections voting underway in a slow nod amid tight security

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలలో మునుపెన్నడూ లేనంత రసవత్తర ప్రచారం సాగినా.. ఓటర్లలో మాత్రం ఆసక్తి అంతంతమాత్రంగానే సాగుతోంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నా.. ఓటర్లలో మాత్రం కోవిడ్ మహమ్మారి భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం ఏడు గంటలకు నుంచి ప్రారంభమైన పోలింగ్ రెండు గంటల వ్యవధిలో అంటే ఉదయం తొమ్మిది గంటల వరకు కేవలం 3 శాతం మాత్రమే నమోదు కావడం కోవిడ్ భయాన్ని తలపిస్తోంది. నగరంలోని అనేక మంది ఓటర్లు ఉదయాన్నే తమ ఓటును వినియోగిచుకుని ఆతరువాత తమ కార్యకలాపాలు చూసుకుంటారు. దీంతో ఉదయం రెండు నుంచి నాలుగు గంటల లోపు 20 నుంచి 30 శాతం మేర పోలింగ్ సాధారణంగా నమోదయ్యేది. కానీ ఈ సారి అందుకు భిన్నంగా కేవలం 3 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది.

ఇక మధ్యాహ్న సమయంలోనూ ఓటింగ్ శాతం అత్యంత మందకొడిగా సాగడం సాధారణమే. అయితే ఇక సాయంకాల వేళ ఆరు గంటల వరకు పోలింగ్ కు అవకాశం కల్పించడంతో ఓటింగ్ శాతం సాయంకాలం పుంజుకుంటుందనే అభిప్రాయాన్ని ఎన్నికల అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు మాత్రం ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ప్రజలు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ చేతులను శానిటైజ్ చేసుకుని పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. నగరవాసులు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామాన్ని పరఢవిల్లేలా చేయాలని అభ్యర్థిస్తున్నారు.

ఓట్లు గల్లంతయ్యాయంటూ చంద్రాయణగుట్ట ఇంద్రానగర్లో పలువురు ఓటర్లు ఆందోళనకు దిగారు. తమ ఓట్లను ప్రభుత్వం కావాలనే తొలగించిందని వారు అరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని మరి కొందరు తమ ఓట్లు తమకు తెలియకుండానే, ఎలాంటి సమాచారం అందించకుండానే వేరే డివిజన్ కు మార్చారని ఆరోపించారు. మూడు దశాబ్దాలుగా ఇదే డివిజన్ లో ఓటు వేస్తున్నా.. ఈ ఎన్నికల్లో మాత్రం తమ ఓటు గల్లంతు కావడం అధికారుల చలవా.? లేక అధికార పార్టీ ప్రముఖుల చలవా.? అంటూ పలువురు ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు, కాగా, అమీర్ పేట డివిజన్ లో ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి కనబర్చారు. బల్కంపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం, జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC Elections  slow voting rate  Covid-19 scare  Bandi Sanjay  KTR  CM KCR  BJP  Congress  TDP  Hyderabad  Telangana  Politics  

Other Articles