NEET Result 2020 Declared: Odisha student makes history నీట్ ఫలితాలు వెల్లడి.. ఓపెన్ కానీ వెబ్ సైట్.. విద్యార్థుల్లో టెన్షన్..

Neet result 2020 odisha student shoyeb aftab makes history with perfect score of 720

NEET, NEET 2020, NEET Result, NEET 2020 Result, NEET Result 2020, NEET Exam Result 2020, NTA NEET Result, NEET Exam Result, NEET Answer Key, NEET Answer Key 2020, NEET 2020 Answer Key, NTA NEET, NTA NEET 2020 Answer Key, NTA NEET 2020, ntaneet.nic.in, ntaneet.nic.in Answer Key, NEET Exam 2020 Answer Key, NEET Result Date, NEET 2020 Live Updates, NEET Result Live Updates, NEET 2020 Live, NEET Result 2020 Live Updates, NEET Cut Off, NEET Cut Off 2020, NEET 2020 Rank, Topper Of NEET 2020, neet aiq seats, neet all india quota, neet counselling, neet 2020 counselling, nta neet, neet.nic.in, nta.ac.in, ntaneet

NEET Result 2020 DECLARED LIVE Updates: NEET aspirant from Odisha, Shoyeb Aftab, reportedly made history on Friday with a perfect score in the 2020 medical entrance test. The NTA declared the results on Friday. Shoyeb, the 18-year-old from Rourkela, has landed an All India Rank 1 in NEET 2020

నీట్ ఫలితాలు వెల్లడి.. ఓపెన్ కానీ వెబ్ సైట్.. విద్యార్థుల్లో టెన్షన్..

Posted: 10/17/2020 09:29 AM IST
Neet result 2020 odisha student shoyeb aftab makes history with perfect score of 720

(Image source from: Oneindia.com)

దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించేందుకు నిర్వహించే ప్రవేశపరీక్ష నీట్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి, నీట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ ఫలితాలు విడుదల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. అయితే ఫలితాలను చూసిన తరువాత ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎలాంటి విపరీత నిర్ణయాలకు లోనుకాకూడదని అన్నారు. అయితే ఈ ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులు ఎంత ప్రయత్నించినా వెబ్ సైట్ తెరచుకోకపోవడంతో అందోళనకు గురయ్యారు. ఏకంగా మంత్రికే వైబ్ సైట్ ఓపెన్ కావడం లేదంటూ ట్వీట్ పెట్టారు. మరి ఎన్టీఏ అధికారులు ఎప్పటికి స్పందిస్తారో మరి!

జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం సాయంత్రం నీట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 13న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 14.37లక్షల మందికి పైగా హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 3,862 కేంద్రాల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. సెప్టెంబర్‌ 13న కరోనా నేపథ్యంలో హాజరు కాని విద్యార్థులకు ఈ నెల 14న ప్రత్యేకంగా పరీక్ష రాసే అవకాశం కల్పించారు. తాజాగా ఈ పరీక్ష ఫలితాలను http://ntaneet.nic.in/ వెబ్ సైట్‌ ద్వారా అధికారులు విడుదల చేశారు.

ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులెవరూ నిరుత్సాహపడవద్దని కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ విన్నవించారు. పరీక్షలలో ఉవారి కోసం ఇతర రంగాల్లో అవకాశాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఒక పరీక్షే మనల్ని నిర్వచించదని, ఆయా రంగాల్లో మీ తెలివితేటలు ఈ దేశానికి ఎంతో అవసరమని తెలిపారు. ఈ ఫలితాల్లో ఒడిశాకు చెందిన సోయబ్ అప్తాబ్ అలిండియా మొదటి ర్యాంకు సాధించాడు. మరోవైపు, ఫలితాలు విడుదల చేసినప్పటికీ వెబ్‌సైట్‌ మొరాయించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు సర్వర్‌ డౌన్‌ అయిందని పేర్కొంటూ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. మరి ఎన్టీఏ అధికారులు ఎప్పటికీ సైట్ ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తుందో మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles