Ex-BJP MLA holds meeting in Hathras to back accused హాత్రాస్ నిందితులకు బీజేపి నేత మద్దతు

Hathras case at bjp leader s house rally held in support of the accused

BJP leader, former MLA, Rajveer Pahalwan, right wing groups, uma bharati, hathras gangrape case, yogi adityanath, UP Police, SIT, Bajrang Dal, Karni Sena, RSS, Uttar Pradesh, Politics

Upper caste men belonging to the Thakur community - from rallying in their support. Organised by a local BJP leader, former Hathras MLA Rajveer Pahalwan, the protest was attended by right wing groups such as the Bajrang Dal, Karni Sena and the RSS, some members of which are also part of caste-based organisations such as the Rashtriya Savarna Sangathan and Kshatriya Mahasabha.

హాత్రాస్ ఘటన: నిందితులకు మద్దతుగా పొరాడుతానన్న మాజీ ఎమ్మెల్యే

Posted: 10/06/2020 03:10 AM IST
Hathras case at bjp leader s house rally held in support of the accused

ఉత్తర్ ప్రదేశ్ లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపి, బీజేపి ప్రభుత్వం అపఖ్యాతి మూటగట్టుకుందని ఈ ఘటనలో వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కూడా పలు ప్రజాసంఘాలు తమ గళాన్ని బాధితురాలి కుటుంబానికి మద్దతుగా వినిపిస్తున్నాయి. దీంతో అందరూ బాధితురాలికే మద్దతు పలుకుతున్నారని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం నిందితులకు మద్దతు ప్రకటించాడు,

ఈ ఎమ్మెల్యే ఏ విలువైన పాఠశాలలో అక్షరాభ్యాసం నేర్చుకున్నారో.. ఆయనకు విద్య నేర్పిన గురువర్యులెవరో తెలియదు కానీ.. ఈ ఘటన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఉత్తర్ ప్రదేశ్ లో అగ్గిని రాజేశాయి. యువతులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా ఉండాలంటే… తల్లితండ్రులు వారి వారి ఆడపిల్లలకు విలువలు నేర్పించాలని పలికాడు. అత్యాచారంలో బలైవుతున్న అమ్మాయిలకే విలువలు నేర్పించాలని చెప్పడం.. తమపై జరిగిన దారుణ ఘటనను సభ్యసమాజంలో ఎవరికీ చెప్పవద్దని.. ఇక పోలీసుల వద్దకు అసలు వెళ్లవద్దని పరోక్షంగా ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయని ఆ ఎమ్మెల్యేపై ప్రజాసంఘాలు, విపక్షాలతో పాటు ప్రజలు కూడా మండిపడుతున్నారు. యూపీకి చెందిన ఈ ఎమ్మెల్యే పేరే యూపీ బీజేపీ ఎమెల్యే బల్లియ సురేంద్ర సింగ్.

ఇంతటితో ఆగని సదరు ఎమ్మెల్యే.. హాత్రాస్ జిల్లాలోని బాధిత కుటుంబం నివసించే బూల్ గది ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలో నిందితులకు మద్దతుగా కొంతమంది తన అనుఛరులతో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. హాత్రాస్ ఘటనలో నిందితుల తప్పేం లేదని, ఇళ్ల నుంచి బయటకు వచ్చే యువతులు విలువలు నేర్చుకోవాలని సూచనలిచ్చారు, అత్యాచారం చేసినవారి తరుపున తాను పోరాడతానంటూ బరితెగించి మీటింగ్ పెట్టాడు బీజేపీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే. అంతేకాదు ‘‘నిందితుల‌కు అండ‌గా నిలవాలి.. హ‌త్యాచార నిందితుల‌కు న్యాయం జ‌ర‌గాల్సిందే”అని డిమాండ్ చేశాడు. అంతేకాదు బాధితురాలి కుటుంభంపైనా ఎప్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశాడు.

దీంతో.. ఆయన ఒక్కడినే కాకుండా మొత్తం బీజేపీ నేతలు నిందలు పడాల్సి వచ్చింది. బీజేపి నేతలు ఎంతకైనా తెగించేస్తారంటూ ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హాత్రాస్ లో దళిత యువతి పట్ల జరిగిన దారుణాన్ని బీజేపి మహిళా నేతలే ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు మాత్రం యువతులకు విలువలు నేర్పాలని ఒకరు.. నిందితుల తరపున పోరాడుతానని మరోకరు రావడంతో ప్రజలు వీరిపై మండిపడుతున్నారు. రామ రాజ్యంలో శ్రీరాముడి పాలనను తీసుకువస్తామని చెబుతున్న బీజేపి నేతలు అసలు రంగు బయటపడిందని విమర్శలు జోరందుకున్నాయి. బీజేపి నేతల మాటలకు, చేతలకు ఏమాత్రం పోంతన వుండదని ఇలాంటి పలు ఘటనలు గతంలోనూ నిరూపించాయని, ఇక భవిష్యత్తులో మరెన్ని చూడాల్సివస్తుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఈ సభకు పెద్ద ఎత్తులో హాజరైన  పోలీసులు కూడా తమ జిల్లా అధికారులు నెల రోజుల పాటు విధించిన 144 సెక్షన్ అమలులో వున్నా నిందితులకు మద్దతుగా వచ్చి సభలో పాల్గోన్నవారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారిని అడ్డుకునే ప్రయత్నాలు సాగలేదు.. లాఠీ చార్జీలు జరగలేదు.. వారిని తోసివేయలేదు.. కనీసం వారి వస్త్రాలను కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. మరి ఈ మాజీ ఎమ్మెల్యేకే చట్టం దాసోహమైతే.. అమల్లో వున్న నిబంధనలు ఇలా తొలగిపోతే.. ఇక అధికారంలో వున్న నేతల సంగతి అలోచించాల్సిన అవసరం లేకుండా పోతోంది. వారిదే ఇష్టారాజ్యం అన్న సంకేతాలను పరోక్షంగా ప్రభుత్వం జారీ చేసినట్లు కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles