Boy Does Bhangra In Front Of Dogs wins netizens hearts 'నీ ఇంటి ముందుకొచ్చా' అంటూ తొడగొట్టిన బుడత..

Dogs reacting to this young boy s bhangra moves is leaving netizens in splits

Viral video, bhangra, funny dog video, boy funny dance, boy bhangra dance, COVID-19 Crisis, dogs, face masks, Sikh boy, Teasing, video viral, Young boy hilarious dance

A little boy was filmed showing off some stellar bhangra moves to a couple of dogs. While the child's talent on the dance floor - or the road, in this case - impressed many, it was the reaction of the two canines that got the most laughs. In the video which has gone viral on Twitter, the young boy can be seen standing outside the gate of a house with two dogs inside.

ITEMVIDEOS: ‘నీ ఇంటి ముందుకొచ్చా’ అంటూ తొడగొట్టిన బుడత.. ఆడిన శునకాలు

Posted: 10/06/2020 02:56 AM IST
Dogs reacting to this young boy s bhangra moves is leaving netizens in splits

ఓ ఇంటిలో కాపలా కాస్తున్న రెండు జాతి శునకాలతో నిత్యం అదే దారిలో వోళ్లే అదే కాలనీకి చెందిన బుడతడు సవాల్ చేశాడు. అదీనూ నందమూరి నటసింహం బాలయ్యబాబు తరహాలో తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేసి డైలాగులు చెప్పినట్లున్నాడు. నీ ఇంటి ముందుకొచ్చా.. నీ ఇంటి ముందర డాన్స్ వేశా.. నీకు శునక లక్షణమే కనక వుంటూ రా.. బయటకు వచ్చి.. చూడు అన్నట్లుగా వుందీ సవాలు. అంతటితో ఆగకుండా పంజాబీ లో హిట్ అయిన ఓ పాటను పాడుతూ ఆ పాటకు అనుగూణంగా చేసిన సవాలు ప్రకారం డాన్స్ మూవ్ మెంట్స్ కూడా వేశాడు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.

ప్రతినిత్యం ఆ ఇంటి ముందు నుంచి వెళ్తున్న క్రమంలో ఆ ఇంట్లోని శునకాలు బాలుడ్ని చూసి అరిచేవి. దీంతో భయపడి స్పీడుగా వెళ్లడం.. ఆ తరువాత మెల్లిగా వెళ్లడం చేస్తూ.. ఇక వాటితో సరదా ఆటపట్టిస్తూ వెళ్లే కుర్రాడు ఇవాళ తన స్నేహితులతో కలసి సైకిళ్లపై అక్కడకు చేరకున్నాడు, తన సైకిల్ ను ఇంటి ఎదుటే స్టాండ్ వేసిన యువకుడు.. ఇక శునకాలు రావడంతో పాటను అందుకుని వాటి ముందే ఆడుతూ, పాడుతూ డాన్స్ చేశాడు. ఓ మూలన అవి కరుస్తాయన్న భయం వున్నా.. ధైర్యంగా డాన్స్ చేసి.. వెళ్లడం కనబడింది. ఈ వీడియోను అదే ఇంట్లో వున్న సభ్యులు దూరం నుంచి తమ మొబైల్ ఫోన్లలో బంధించారు.

ఇంకేముందు వాటిని సరదాగా నెట్టింట్లో అప్ లోడ్ చేయగా గంటల వ్యవధిలోనే ఈ వీడియోను నెట్ జనులు విపరీతంగా లైకులు, షేర్లతో వైరల్ చేశారు. రోడ్డుపై భాంగ్రా నృత్యం చేస్తుండగా, ఇంటి గేటు లోపల ఉన్న శునకాలు కూడా డ్యాన్సులు చేస్తున్నట్టుగా గెంతాయని ఓకరు.. ఇక ఇలా శునకాలకు కూడా డాన్స్ నేర్చవచ్చు అంటూ మరోకరు.. ఏమాత్రం కల్మషం లేని జీవులు మధ్య సాగినా మెలోడీ డాన్స్ డ్రామా అంటూ మరోకరు ఇలా ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఒక కామెంట్ పెట్టడం గమనార్హం. ఈ వీడియోను ఇప్పటికే నెట్టింట్లో వేల మంది వీక్షించారు. మరెందుకు ఆలస్యం మీరూ.. కానిచ్చేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles