వికారాబాద్ లో వివాహిత దీపిక కిడ్నాప్ కేసు సవాల్ గా తీసుకున్న పోలీసులు ఈ కేసులో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదించారు. దీపిక తల్లిదండ్రులు తమ బిడ్డకు డ్రామాలాడాల్సిన అవసరం లేదని చెప్పిన నేపథ్యంలో వారి అంచనాలను తోసిపుచ్చిన దీపిక తన భర్తతో కలిసే వెళ్లిందని పోలీసులు తేల్చారు. భర్తతో కలసి జీవించడానికే ఎక్కువగా మొగ్గుచూపిన దీపిక తన భర్తతో కలసే వుండేందుకు ఇష్టపడి వెళ్లిందని పోలీసులు కనుగోన్నారు. ముందునుంచీ పోలీసులు ఈ మేరకు అనుమానిస్తున్నా దీపిక తల్లిదండ్రులు మాత్రం అందుకు భిన్నమైన కథనాలను వెలిబుచ్చారు.
స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసులో దీపికతో పాటు అమె భర్త అఖిల్ ను సదాశివపేట్ లో ఉండగా పోలీసులు అక్కడి నుంచి వారిని వికారాబాద్ కు తీసుకువచ్చారు. మీడియా ముందు వారిని ప్రవేశపెట్టిన తరువాత వారిని మెజిస్ట్రేట్ ఎదుట కూడా హజరుపర్చారు. దీపిక అచూకీ కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఏకంగా 48 గంటల తరువాత కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు ఈ జంట పోలీసులకు ఇచ్చిన సమాచారంతోనే వారి ఆచూకీని పోలీసులు తెలుసుకున్నారని సమాచారం. ఇక ఈ కేసులో తాజాగా పోలీసులు వెలువరించిన వివరాలు ఇలా వున్నాయి.
ఖలీల్ అలియాస్ అఖిల్‌ను ప్రేమించిన దీపిక నాలుగేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టంలేని దీపిక తల్లిదండ్రులు కుమార్తెను ఇంటికి తీసుకొచ్చి ఆమెతో విడాకులకు దరఖాస్తు చేయించారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా, ఈ నెల 27న సాయంత్రం పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తా సమీపంలో దీపిక కిడ్నాప్ అయింది. ఆమె కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరు బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తననెవరూ కిడ్నాప్ చేయలేదని, కావాలనే భర్తతో కలిసి కారులో వెళ్లినట్టు దీపిక పేర్కొందని పోలీసులు తెలిపారు. కోర్టులో దీపిక చెప్పే దానిని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more