Set back to AP Govt in Supreme Court సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఎదురుదెబ్బ..

Ap three capitals sc refuses to give stay on high court status quo

High Court bench, Amaravati, Capital, CRDA, Justice Rakesh Kumar, Justice AV Sesha Sai, Justice M Satyanarayana Murthy, Ministry of Home Affairs

After hearing the arguments over vacating the AP High Court status quo on three capitals and CRDA repeal Acts, the Supreme Court refused to give stay and directed the AP government to continue their arguments in the High Court. The three-judge bench headed by Justice Ashok Bhushan has informed the AP government that the Supreme Court cannot interfere when the High Court is hearing the batch of petitions

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఎదురుదెబ్బ.. హైకోర్టులోనే తేల్చుకోవాలని హితవు

Posted: 08/26/2020 05:09 PM IST
Ap three capitals sc refuses to give stay on high court status quo

రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు ఎదురుదెబ్బ తగిలింది, ఇన్నాళ్లు రాష్ట్రోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బలు తిన్న ప్రభుత్వం ఈసారి ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అదే అనుభవాన్ని అందుకుంది, పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను రద్దు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ప్రభుత్వానికి అక్కడ ఎదురుదెబ్బ తగిలింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పిటీషన్ ను విచారణను స్వీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్టేటస్ కో ఇవ్వడం కూదరదని ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. మూడు రాజధానుల వ్యవహారంపై ఈ నెల 27న (రేపే) హైకోర్టులో విచారణ ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం అభిప్రాయపడింది. నిర్ణీత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించేలా ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా... ఫలాన గడువులోపు విచారణ ముగించాలని తాము ఆదేశించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈకేసును హైకోర్టు త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం వాదనలపై న్యాయవాది నారీమన్‌ అభిప్రాయాన్ని ధర్మాసనం ప్రత్యేకంగా తీసుకుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పడిందని, రాష్ట్రపతి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని నారీమన్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులపై అసెంబ్లీలో చట్టం చేయరాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేశామని ఎలా చెబుతుందని నారీమన్‌ ప్రశ్నించారు. నారీమన్‌ అభిప్రాయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజధాని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు శ్యాందివాస్‌, నీరజ్‌కిషన్‌పాల్‌ వాదనలు వినిపించారు.

ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ధర్మాసనం ముందుకు ఆ తర్వాత జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌ ధర్మాసనం ముందుకు మూడు రాజధానుల పిటిషన్ విచారణకు వచ్చినా... సాంకేతిక కారణాలతో మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. దీంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ఇవాళ జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ , జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. అయితే సుప్రీం విచారణ నేపథ్యంలో ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది, ఇక ఈ కేసుపై రాష్ట్ర హైకోర్టులో రేపు విచారణ జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles