Rain Lashed Over Hyderabad today హైదరాబాద్ పరిసర ప్రాంతల్లో భారీ వర్షం.. రోడ్లు జలమయం

Rain lashed over hyderabad and other districts in telangana

weather, weather today, weather in hyderabad, telangana weather, andhra pradesh weather, weather in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, Telangana, Andhra Pradesh, weather forecast, tamil nadu weather, karnataka weather

With the Southwest Monsoon intensifying across Telangana, different parts of the city have been receiving heavy rainfall today since noon, Which also led to traffic jams in the city.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం.. రోడ్లు జలమయం

Posted: 08/01/2020 11:04 PM IST
Rain lashed over hyderabad and other districts in telangana

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని భారతీయ వాతావరణ కేంద్రం ముందస్తుగా చేసిన అంచానాల నిజమవుతుండటం ఒకింత సంతోషంగా వున్నప్పటికీ..  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం వరుసగా ప్రతీ రోజు వర్షం కురుస్తోంది. కాగా తాజాగా ఇవాళ నగరంలోభారీ వర్షం కురిసింది. ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఉరుములు, మెరుపులతో నగరవాసులను వరుణుడు భయకంపితుల్ని చేశాడు. ఇక వాయువు కూడా జతకలవడంతో పలు చోట్ల చెట్లు కూడా విరిగిపడ్డాయి.

నగరంలో పలు చోట్ల ఉరుములు మెరుపుల‌తో పాటు బ‌ల‌మైన ఈదురు‌ గాలులు కూడా వీచాయి. ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మైత్రీవనం, మియాపూర్, చందానగర్, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లిలో గరిష్టంగా 4.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీనికి తోడు నగర పరిసర ప్రాంతాల్లోని జిల్లాల్లోనూ వర్షం భారీగా కురిసింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఇక భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి.

వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఇవాళ, రేపు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.  అలానే కొన్ని చోట్ల విద్యుత్‌కి అంత‌రాయం ఏర్ప‌డింది. కాగా గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తోన్న సంగ‌తి తెలిసిందే. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rain  low pressure  thunder storms  lightening  Bay of Bengal  Telangana  Andhra Pradesh  weather forecast  

Other Articles