(Image source from: News24online.com)
దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో మరోమారు యాబై వేలకు పైబడిన కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇవాళ దేశంలోనే అత్యధిక స్థాయిలో ఏకంగా యాభై వేలకు పైబడి కేసులు నమోదు చేసుకుని ఉగ్రరూపం దాల్చుతుంది. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తన ఉద్దృతిని పెంచుతూ సమూహవ్యాప్తిలోకి చేరిందన్న సమాచారంతో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత వారం రోజులుగా 45 వేల మార్కుకు పైబడిన కేసులు తాజాగా 57 వేల మార్కును అధిగమించి కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరణాలను కూడా పెంచేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది.
రోజురోజుకూ తన వ్యాప్తిని కూడా దేశ ప్రజలపై ఉదృతంగా కొనసాగిస్తోంది. ఫలితంగా కరోనా ప్రభావనపడిన దేశాల్లో రెండవ స్థానంలో భారత్ నిలిచింది. ఇక దేశంలో మరణాలు కూడా ఏకంగా ముఫై ఆరు వేల మార్కును దాటేసాయి. దీంతో భారత్.. ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన ఆరవ దేశంగా నమోదైంది. గత వారం రోజులుగా కరోనా కేసులు వ్యాప్తి ఉదృతంగా కోనసాగుతోంది. దేశంలో లాక్ డౌన్ విధించిన నాటి నుంచి ఇవాళ్టికి 129 రోజుల వ్యవధిలో దేశంలో పదహారు లక్షల మార్కును కేసులు అధిగమించాయి, కాగా, 36 వేలకు పైబడిన మరణాలు కూడా సంభవించాయి, అన్ లాక్ 2.0 అమల్లోకి వచ్చిన జూన్ 7 నుంచి రోజుకు ఎనమిది వేలకు పైబడిన సంఖ్యలో కేసులు నమోదు కాగా, తాజాగా లాక్ డౌన్ విధించిన 129 రోజుల తరువాత ఏకంగా 57 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం దేశప్రజల్లో అందోళన మరింత తీవ్రమైంది.
దేశంలో క్రమంగా జడలువిప్పుతున్న కరోనా మహమ్మారి ఏకంగా పదహారు లక్షల మార్కును దాటింది. కరోనా పాజిటివ్ కేసులు ఉద్దృతి పెరుగుతున్న ఈ క్రమంలో కొంచెం కఠిన నిబంధనలు పెట్టాల్సిన కేంద్రం అన్ లాక్ 2.0 మార్గదర్శకాలలో రాకపోకలకు వెసలుబాటు కల్పించడం కూడా తీవ్రతను పెంచేందుకు కారణం అవుతుందన్న వాదనలు వినబడుతున్నాయి. ఇక అన్ లాక్ 3.0 కూడా అమల్లోకి రానుండంతో మరికోన్ని సడలింపులు కూడా అమల్లోకి రావడంతో మరిన్ని కేసులు పెరుగుతాయా.? అన్న అందోళన కూడా రేకెత్తుతోంది. ఆరుమాసాలు పైగా గడుస్తున్నా ఈ మహమ్మారి కట్టడికి ఇప్పటికీ వాక్సీన్ రాకపోవడం కూడా దేశ ప్రజల్లో అందోళనకు కారణమవుతోంది.
గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఏకంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారిందో అర్థంచేసుకోవచ్చు. ఇక దీనికి తోడు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. ప్రతీ రోజు మూడు వందలకు పైబడిన సంఖ్యలో నమోదైన మరణాలు.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 764 మార్కును అందుకున్నాయి, ఇక తాజాగా మరణాల్లోనూ భారత్ ఏకంగా ప్రపంచంలో ఆరవ స్థానంలో నమోదు కావడం గమనార్హం. ఇక 36 వేలకు పైబడిన మరణాలతో ఐదవ స్థానంలో వున్న ఇటలీని కూడా భారత్ అధిగమించి ఐదవ స్థానంలో కోనసాగుతోంది. అంతకంతకూ పెరుగుతున్న మరణాలు దేశ ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి, దేశంలో జులై 1 అన్ లాక్ 2.0 నుంచి అమల్లోకి రావడంతో రాకపోకలకు అనుమతులు లేకుండా చేసింది.
దీంతో పరిమిత సంఖ్యలోనే తిరిగిన వాహనాలు ఇకపై పూర్తిస్థాయిలో రోడ్డును ఎక్కనున్నాయి. మాల్స్, బార్లు, ధియేటర్లు, స్టేడియాల్లో ఆటలు ఇలా భారీ సంఖ్యలో జనసమూహం వున్న ప్రాంతాల్లో కార్యకలాపాలు మినహాయించి మిగిలిన అన్ని వ్యవహారాలకు అన్ లాక్ 1.0 తలుపులు తెరిచింది. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 55,079 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 16,95,988 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులలోనే నమోదయ్యాయి, వీటితో పాటు దేశంలో నిన్న ఏకంగా 764 మరణాలు నమోదయ్యాయి, దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య ముఫై ఐదు వేల మార్కును దాటాయి. తాజాగా నమోదైన మరణాల సంఖ్య ఏకంగా 36,569 కు చేరింది.
దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్ర ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 10,94,374 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 5,25,689 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు స్వల్పంగా తగ్గి 64.54 శాతంగా నమోదైంది.
ఇక దేశవ్యాప్తంగా ఏకంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 36,569 మంది కోరనా బాధితులు కొలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా ఉద్దృతి భారీగా పేరుగుతోంది. దేశంలో నమోదైన మొత్తంలో పన్నెండు లక్షల కరోనా కేసులలో సమారు నాలుగున్నర లక్షల కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ఇక దేశంలోని మరణాలలోనూ ఈ రెండు రాష్ట్రాల నుంచే అధికం. మహారాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండం చేస్తుండంతో అక్కడి సామాన్య ప్రజల జీవినం స్థంభించింది. మహారాష్ట్రలోని దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా మహమ్మారి తన పంజాను విసురుతూ వేలాది మందిపై ప్రభావాన్ని చూపుతోంది. మరోవైపు ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి శాతం దేశ జాతీయశాతం కన్నా అధికంగా 64.44గా నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more