HC orders Nimmagadda to meet governor గవర్నర్ ను కలవాలని నిమ్మగడ్డకు హైకోర్టు సూచన

Ap high court orders nimmagadda ramesh to meet governor to enforce its judgement

AP High Court, Nimmagadda Ramesh, state election commissioner, AP Governor, AP SEC, CM YS Jagan, Ashwini Kumar, Advocate General, Nimmagadda Ramesh cases, Andhra Pradesh SEC, Andhra Pradesh news

The High Court questioned the government as to why Nimmagadda was not appointed despite the Supreme Court's refusal to stay the verdict. The High Court directed the government to file a counter-affidavit and adjourned the next hearing to next Friday.

ఏపీ సర్కారుపై రాష్ట్రోన్నత న్యాయస్థానం ఆగ్రహం..

Posted: 07/17/2020 06:40 PM IST
Ap high court orders nimmagadda ramesh to meet governor to enforce its judgement

రాష్ట్రానికి చెందిన ఎన్నికల కమీషనర్ పదవిలో కొనసాగింపుపై న్యాయస్థానాలు స్పష్టమైన అదేశాలను జారీ చేసినా.. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికీ ఈయన పదవీ బాధ్యతలను చేపట్టకుండా అడ్డంకులు సృష్టించడంపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను పదవీ బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకుంటున్న రాష్ట్రప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్తానం సుప్రీంకోర్టులో మూడు సార్లు విచారణ జరిగినా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని రమేశ్‌ కుమార్‌ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

అయినా.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయలేదని వివరించారు. ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తరపు న్యాయవాది అశ్వినీ కుమార్ న్యాయస్థానం దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు బాధ్యతలను ఎందుకని అప్పగించడం లేదని న్యాయస్థానం ప్రభుత్వం తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపింది. రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ ను కలిసి ఆయనకు వినతిపత్రం అందజేయాలని రమేశ్‌కుమార్‌కు సూచించింది.

రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు వెలువరించిన తీర్పును అమలు చేయాలని గవర్నర్ ను కోరాలని ఆదేశించింది. కాగా గవర్నర్ ను కలిసేందుకు ఇప్పటికే ఆయన అపాయింట్ మెంట్ కోరామని రమేష్‌ కుమార్‌ తరఫు న్యాయవాది తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ను నియమించే అధికారం గవర్నర్ కు ఉందని ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles