India to resume international flights అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ..

Air france united airlines to restart flight operations from india

Central aviation minister hardeep singh puri, international flights, Civil aviation, Union minister, civil aviation minister, hardeep singh puri, international flights resumed after lockdown, Unlock 2.0, United States, France, Germany

Civil Aviation Minister, Hardeep Singh Puri said Air France and united airlines is all set to restart international flight operations from India. Puri said Air France will be operating 28 flights on the Delhi, Mumbai, and Bengaluru sector between July 18-August 1. While United Airlines will be operating 18 flights between India and the US between July 17-31.

ఆ దేశాల నుంచి.. అంతర్జాతీయ విమాన సర్వీసులు షురూ..

Posted: 07/17/2020 06:31 PM IST
Air france united airlines to restart flight operations from india

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌ కారణంగా నిలిచిపోయిన విదేశీ విమాన స‌ర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పలు దేశాలతో జరిపిన చర్చలు పలించడంతో ఆయా దేశాలు త్వరలోనే భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సేవలను నెరపేందుకు అంగీకారం తెలిపాయని పేర్కోన్నాయి. తొలుత ఇందుకు సంబంధించి మూడు దేశాల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయ‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్ దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఎయిర్ ఫ్రాన్స్, యూనైటెడ్ ఎయిర్ లైన్స్ తొలుత సర్వీసులను ప్రారంభిస్తాయని ఆ తరువాత జర్మనీ కూడా వచ్చి చేరుతుందని అన్నారు.

అమెరికా, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ దేశాలకు చెందిన పౌర విమానయాన అధికారులతో జరిపిన ఫలప్రదం అయ్యాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ వెల్లడించారు. అమెరికా రేప‌టి(శుక్రవారం) నుంచి, ఫ్రాన్స్ ఎల్లుండి(శనివారం) నుంచి భార‌త్ కు విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు ఆ దేశాలు అంగీక‌రించాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ నెల 18 నుంచి ఆగ‌స్టు 1 వ‌ర‌కు పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు మ‌ధ్య ఎయిర్ ఫ్రాన్స్ 28 విమానాల‌ను న‌డ‌ప‌నుంద‌ని వెల్ల‌డించారు. ఈ నెల 17 నుంచి 31 వ‌ర‌కు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ భార‌త్ - అమెరికా మ‌ధ్య‌ 18 విమానాల‌ను న‌డిపేందుకు ఒప్పందం జ‌రిగింద‌ని కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ తెలిపారు.

జ‌ర్మ‌నీతో కూడా విమాన స‌ర్వీసుల‌పై సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని, లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ తో కూడా ఒప్పందం ఓ కొలిక్కి వ‌చ్చినట్లుగా మంత్రి హర్ దీప్ సింగ్ స్పష్టం చేశారు. అయితే లాక్ డౌన్ విధించుకు కూర్చున రోజుల నుంచి మళ్లీ సాధారణ స్థితికి జనజీవనాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని అందులో భాగంగానే విదేశీ విమానాయాన సర్వీసులను ప్రారంభిస్తున్నామన్నారు. దేశీయంగా మే 25 నుంచే విమానయాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినా.. విదేశీయాన సర్వీసులు మాత్రం అనుమతించేందుకు పలు రాష్ట్రాలు, నగరాలు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కరాణంగా తెలిపారు.

ఇప్పటికీ పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పోడిగిస్తూ నిర్ణయాలు తీసుకోవడం, అదనపు ఆంక్షలను కోనసాగిస్తున్న నేపథ్యంలో కేవలం పలు ఎంపిక చేసిన భారత దేశనగరాలకు మాత్రమే విదేశీ విమనాయాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని అన్నారు, అయితే ఓ వైపు కరోనా ఉద్దృతిని తట్టుకుని విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్న క్రమంలో ధరలు మాత్రం కాస్త అధికంగానే వుంటాయని తెలిపారు. అయితే గల్స్ దేశాల్లోని భారతీయులను వెనక్కి తీసుకువచ్చే క్రమంలో నడిపిస్తున్న వందే భారత్ విమానాల ధరలు మాత్రం కాసింత తక్కువగాను వున్నాయని ఆయన హర్దీప్ సింగ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles