Siliguri Police soft punishment for not wearing masks మాస్క్ పెట్టుకోకపోతే.. గంటల పాటు రోడ్డుపై వెయిట్ చేయాల్సిందే.!

Siliguri metropolitan police enforces soft punishment for people not wearing masks

Wear mask, Soft punishment, Siliguri, Health and Family Welfare Department, Siliguri Metropolitan Police, mask offenders, West Bengal

In order to ensure people use masks on the roads, the health department advised the Siliguri Metropolitan Police to enforce 'soft punishment' for the offenders. 'Wear Mask' campaign in city is being practiced in the city with full dedication.

ITEMVIDEOS: మాస్క్ పెట్టుకోకపోతే.. గంటల పాటు రోడ్డుపై వెయిట్ చేయాల్సిందే.!

Posted: 07/11/2020 04:41 PM IST
Siliguri metropolitan police enforces soft punishment for people not wearing masks

పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ ప్రాంతంలోని సిలిగురి ప్రదేశానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకంగా ప్రసిద్ది చెందింది. దీంతో ఇక్కడ పోలీసులు కూడా అత్యంత బాధ్యతాయుతంగా మెలుగుతారు. కరోనా తీవ్ర కలకలం రేపుతున్న తరుణంలో అక్కడి పోలీసులు వినూత్నంగా వేర్ మాస్క్ ( మాస్క్ ధరించండీ) అన్న ప్రచారాన్ని కూడా విరివిగా నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇది ప్రస్తుత కరోనా కాలంలో తప్పనిసరి నిబంధనగా పేర్కోంటున్నారు. ఆ నిబంధనను అతిక్రమిస్తే కొన్ని రాష్ట్రాలు నగదు జరిమానా.. మరికొన్ని రాష్ట్రాలు అరెస్టులు.. జైలు అంటూ హెచ్చరిస్తున్నాయి.

ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతూ.. మాస్క్ లు పెట్టుకోకుండా బైటకొస్తే.. కఠిన నిర్ణయాలు తీసుకుంటామని మరికోన్ని రాష్ట్రాలు వార్నింగ్ జారీ చేస్తున్నాయి. ఈ తరుణంలో సిలిగురి పోలీసులు మాత్రం వినూత్నమైన శిక్షలు వేస్తున్నారు. కరోనా కాలంలో ప్రజలందరూ డబ్బుల కోసం కష్టాలు పడుతున్నారనో ఏమో తెలియదు కానీ.. జరిమాలు కాకుండా.. విచిత్రమైన శిక్షలు వేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా రోడ్డుపైకి వచ్చివారిని నడి రోడ్డుపై రెండు గంటలపాటు కూర్చోబెట్టి ‘నిరీక్షణ శిక్ష’ విధిస్తున్నారు సిలిగురి పోలీసులు. ఫైన్ వేస్తే ఏదో డబ్బులిచ్చేసి వెళ్లిపోవచ్చు. కానీ..పనులపై వెళ్తున్నవారు ఇలా గంటల తరబడి కూర్చోవటం అదికూడా నడిరోడ్డుపై కూర్చోవటం చాలా ఇబ్బందికరంగా మారింది.

దీంతో తప్పదురా బాబూ ఎందుకొచ్చిన గొడవ అనుకుంటున్న ప్రజలు మాస్క్ పెట్టుకోకుండా బయటికి రావడం మానేశారు. పది నిమిషాల పనికి కూడా గంటల తరబడి నిల్చోవస్తోందని ఇంట్లోంచి బయటకు వెళ్లేప్పుడే మాస్క్ తీసుకెళ్తున్నారు. ఇల్లు కదిలితే చాలా ఎక్కడ పోలీసులు కనిపిస్తారో..రోడ్డు పై రెండు గంటలు కూర్చోబెడితే పరువు పోతుందని కంపల్సరిగా మాస్క్ లు పెట్టుకుంటున్నారు. ఇంకోసారి మాస్క్ పెట్టుకోకుండా బయటికి రాము సార్..అని చెబుతున్నారు. సిలిగురిలో కరోనా వైరస్ కేసులు పెరిగిన నేపథ్యంలో స్థానిక పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని 9 మున్సిపల్ వార్డులు, డార్జిలింగ్, జల్ పాయ్ గురి జిల్లాల్లో పూర్తిగా లాక్ డౌన్ విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wear mask  Siliguri Metropolitan Police  mask offenders  West Bengal  

Other Articles