Psoriasis injection does protect against Covid-19 కరోనా తీవ్ర ప్రభావిత రోగుల్లో గుణం చూపుతున్న ఆ ఇంజెక్షన్...!

Psoriasis injection okayed for limited use to treat covid 19 patients drug controller

covid 19, coronavirus, Psoriasis injection, Biocon, monoclonal antibody injection, Itolizumab, Drugs Controller General of India, clinical trials

India's drug regulator has approved Itolizumab, a drug used to cure skin ailment psoriasis for “restricted emergency use” to treat Covid-19 patients with moderate to severe acute respiratory distress, officials told

కరోనా తీవ్ర ప్రభావిత రోగుల్లో గుణం చూపుతున్న ఆ ఇంజెక్షన్.. డీజీసీఐ అమోదం.!

Posted: 07/11/2020 03:55 PM IST
Psoriasis injection okayed for limited use to treat covid 19 patients drug controller

ప్రమాదకారి కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను కబళించి.. మరణమృదంగాన్ని మ్రోగిస్తున్న తరుణంలో దానిని కట్టడి చేయడానికి ఇప్పటికే పలు ఔషదాలు వచ్చినా ఇంకా మరణాలు మాత్రం అగడం లేదు. ఈ క్రమంలో రెమిడెసివీర్ మందును సిప్లా, హెటరోలతో పాటు పలు కంపెనీలు ఔషదాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయినా కరోనా ప్రభావం అధికంగా వున్న బాధితుల్లో ఈ వైరస్ అదుపు చేయడానికి వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నా.. వారిలో మాత్రం గుణం కనిపించకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. దీంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఈ పరిస్థితులకు చేరిన రోగులకు సంజీవనిలా మారింది మరో దివ్యౌషధం. తీవ్రమైన శ్వాసకోశ బాధలతో ఇబ్బంది పడుతున్న రోగులకు చికిత్స చేయడానికి “పరిమితం చేయబడిన అత్యవసర ఉపయోగం” కోసం చర్మ వ్యాధి సోరియాసిస్ ను నయం చేయడానికి ఉపయోగించే మెడిసిన్ ఇటోలిజుమాబ్ తో గుణం కనిసిస్తోంది. కరోనా రోగులపై జరిపిన క్లినికల్ ట్రయల్స్ లోనూ సంతృప్తికర పలితాలు రావడంతో భార‌త డ్ర‌గ్ రెగ్యులేట‌రీ అథారిటీ కూడా ఈ మందును తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులను ఎదర్కొంటున్న కరోనా పేషంట్స్ కు ఈ మందును వినియోగించేందుకు అనుమతించింది. ఈ మేరకు అమోదం తెలిపింది. దీంతో తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్‌కు గురైన వారిపై ‘ఇటోలీజుమ్యాబ్‌’ ను వైద్యులు వినియోగిస్తున్నారు.

ఇటోలిజుమ్యాబ్ మందు కరోనా రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తోందని, వెంటిలేటర్‌ దశ నుంచి కూడా కొందరు సాధారణ స్థితికి చేరుకున్నట్లు నిపుణుల కమిటీ వెల్లడించింది. దీంతో కోవిడ్-19 చికిత్సకు అపరిమితమైన వైద్య అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటోలీజుమ్యాబ్‌ ఇప్పటికే చాలా ఏళ్లుగా సోరియాసిస్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మెడిసిన్ వినియోగానికి ముందు ప్రతి రోగి లిఖితపూర్వక సమ్మతి అవసరం ఉంది. ఇటోలీజుమ్యాబ్ మందును భార‌త్‌కు చెందిన బ‌యోకాన్ సంస్థ త‌యారు చేస్తోంది. ఈ మందు ఒక్క డోసు ధర రూ.60 వేలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles