Asymptomatic patients cannot spread infection: WHO లక్షణాలు కనిపించని పాజిటివ్ రోగులతో వ్యాప్తి తక్కువే.!

Asymptomatic covid 19 carriers cannot spread infection who

coronavirus, covid-19, coronavirus symptoms, air borne, coronavirus transmission, who, what is asymptomatic coronavirus, symptomatic vs asymptomatic coronavirus, covid-19, Coronavirus symptoms, coronavirus cases india, asymptomatic carriers, coronavirus symptoms, scientists, WHO, OPen letter lockdown, covid-19 india, Coronavirus treatment, Health, Coronavirus, Covid-19, airborne transmission, World Health Organization, WHO, coronavirus transmission, Coronavirus symptoms, corona in India

World Health Organisation let out a statement recently, saying that COVID-19 transmission rate from asymptomatic patients is "rare". However, soon after, they retracted the statement, adding that the statement was misinterpreted and much data remains unknown and there, actually was a 40% chance of patients transmitting the illness onto others without being symptomatic.

లక్షణాలు కనిపించని పాజిటివ్ రోగులతో వ్యాప్తి తక్కువే.!

Posted: 07/10/2020 07:30 PM IST
Asymptomatic covid 19 carriers cannot spread infection who

కొవిడ్-19 వైరస్ ఎంతటి ప్రమాదకారి వైరస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్త ప్రజలకు అవగతమైంది. ఇంతలా ఎలా విస్తరిస్తోందన్న అలోచనలతో శాస్త్రవేత్తల పరిశోధనలు సాగాయి. ఫలితంగా 32 దేశాలకు చెందిన 239 మంది వైద్య నిపుణుల బృందం.. ఈ మహమ్మారి గాలి నుంచి కూడా సోకుతుందని అందుకు తమ వద్ద ఆధారాలు కూడా వున్నాయిని ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. దీంతో రంగంలోకి దిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తోందన్న వాదనలను కొట్టిపారేయలేమని కూడా చెప్పింది. జనసామర్థ్యం అధికంగా వున్న ప్రాంతాల్లో, గాలి, వెలుతురు సరిగ్గా లేని ప్రాంతాల్లో గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని కూడా పేర్కోంది.

అయితే దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలను సేకరించి విశ్లేషించాల్సి వుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కొన్ని ప‌రిస్థితుల్లో మాత్రమే ఇది సాధ్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా రెస్టారెంట్లు, క్లబ్, డిస్కోథెక్, బార్లు, ప్రార్థనా మందిరాలు, వ్యాయామ కేంద్రాలు సహా జనసామర్థ్యం అధికంగా వుండే ప్రదేశఆల్లో ప్ర‌దేశాల్లో మాత్ర‌మే వైర‌స్ గాలిలో వ్యాపించే అవ‌కాశాలను అధ్య‌య‌నాలు సూచిస్తున్నాయ‌ని తెలిపింది. ఇక గాలి నుంచి కూడా ఈ వైరస్ వ్యాప్తిస్తుందన్న వాదనపై ఇన్నాళ్లు కేవ‌లం అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో రోగులను శ్వాస యంత్రాల‌పై ఉంచే సందర్భాల్లో మాత్ర‌మే వైర‌స్ అలా వ్యాపిస్తోందని వాదించిన డబ్యూహెచ్ఓ తన వాదనను మార్చుకుంది. ఇండోర్ ప్రాంతాల్లో గాలికి వెంటిలేషన్ తక్కువగా వున్న ప్రదేశాల్లో వైరస్ గాలిలో వుంటుందని స్పష్టం చేసింది. తద్వారా గాలి నుంచి వైరస్ ఇతర వ్యక్తులకు వ్యాప్తి చేందే అవకాశాలు లేకపోలేదని పేర్కోంది.  

అదే సమయంలో ఎసింప్ట‌మేటిక్(ల‌క్ష‌ణాలు కనిపించ‌ని) వ్య‌క్తుల‌తోనూ వైర‌స్‌ వ్యాప్తి పెరుగుతున్న‌ట్లు అభిప్రాయ‌ప‌డుతున్న‌ శాస్త్రవేత్త‌ల సంఖ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరుగుతోంది. వైర‌స్‌ని వ్యాప్తి చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఎసింప్ట‌మేటిక్ వ్య‌క్తులలో ఉన్న‌ప్ప‌టికీ, ఇది చాలా అరుదు అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం ల‌క్ష‌ణాలు లేనివారి నుంచి వైర‌స్ సంక్ర‌మ‌ణ స‌మాజంలో ఏస్థాయిలో ఉందో నిజంగా ఇప్ప‌టివ‌రకు తెలియ‌ద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ అభిప్రాయ‌ప‌డింది. ఎక్కువశాతం వైర‌స్ సోకిన వ్య‌క్తులు ద‌గ్గు, తుమ్మిన‌ప్పుడు వ‌చ్చే తుంప‌రుల ద్వారానే వైర‌స్ వ్యాప్తి చెందుతున్న‌ట్లు మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles