Ever heard of the Pani Puri ATM కాంటాక్టు లెస్ అటోమెటిక్ పానీపూరీ ఏటీయం

Covid 19 innovation pani puri automatic vending machine becomes a rage on social media

coronavirus, covid-19, pani puri machine, pani puri vending machine, corona innovation, pani puri in lockdown, pani puri automatic machine, Pani Puri ATM, golgappa, vending machine, golgappa dispense machine, hygienic Pani Puri, Pani Puri ATM machine, zero contact pani puri, coronavirus, lockdown, innovation, Assam

A video on Twitter has gone viral of a man demonstrating his genius 'pani puri vending machine' and probably the need of the hour, considering the lockdown. The machine works like any other vending machine, a person has to put in the money and a small conveyor belt will dispense out stuffed Pani puris slowly, completely contactless.

ITEMVIDEOS: కరోనా ఎఫెక్ట్: కాంటాక్టు లెస్ అటోమెటిక్ పానీపూరీ ఏటీయం

Posted: 07/04/2020 09:09 PM IST
Covid 19 innovation pani puri automatic vending machine becomes a rage on social media

కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ దేశ ప్రజలు ఏది ముట్టుకోవాలన్నా.. ఏది తినాలన్నా జంకుతున్న పరిస్థితి ఏర్పడింది. హోటళ్లుకు స్వస్వి చెప్పి.. ఇంట్లోనే వేడివేడిగా వంటలు చేసుకుంటున్న వారి సంఖ్య ఇప్పుడు అధికంగానే వుంది. ఇప్పటి వరకు తమ బిజీ షెడ్యూల్ట్ నేపథ్యంలో వంటకు, వంటింటికీ దూరంగా వున్న ప్రముఖ మహిళామణులు కూడా తమ సమయాన్ని పూర్తిగా ఇంట్లోవారితో గుడుపుతూ.. ఇంట్లోనే సరికొత్త రుచులు చేస్తున్నారు. ఇక ఇప్పటికీ కొందరు మాత్రం తమకు నచ్చిన వంటలు చేసుకునేందుకు యూట్యూబ్, గూగుల్ లాంటి వాటిని కూడా ఆశ్రయిస్తున్నారు. మరోలా చెప్పాలంటే లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో వంటలు ఎలా చేయాలన్న అంశాలను భారీగీ వ్యూస్ వచ్చాయి.

ఇక పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి నోరూరించే పానీ పూరీ ప్రియులకు ఈ యువ ఇంజనీర్లు శుభవార్త అందించారు. ఎక్కడ ఏం తినాలన్నా భయం పడే పరిస్థితుల్లో ఎలాంటి భయం లేకుండా నేరుగా ఏటీయం కేంద్రంలోకి వెళ్లి తమ స్వహస్తాలతో పానీ పూరి తినేయవచ్చునని చెబుతున్నారు. ఏటీయం కేంద్రంలోకి వెఁళ్తే డబ్బులు డ్రా చేసుకోవచ్చు లేదా లావాదేవీల వివరాలను తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ పానీ పూరి ఎలా తీనవచ్చు అంటున్నారా.? అయితే ఇది అన్ని ఏటీయం కేంద్రాలలో లభ్యం కాదు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఏటీయం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు యువ ఇంజనీర్లు. కరోనా కాటు వేస్తున్న నేపథ్యంలో కాంటాక్టు లెస్ ట్రాన్స్ యాక్షన్ తో అటోమెటిక్ గా వచ్చే పానీపూరిని లాగించేవచ్చు.

అదెలా అంటే..

 

ఆటో పానీపూరి వెండింగ్ మిషెన్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. అవి యాంత్రికంగా ఎలాంటి హ్యూమన్ కాంటాక్టు లేకుండా పానీ పూరీని అందిస్తాయి. అదెలా అంటే.. మొదట ఈ అటో పానీపూరి వెండింగ్ మెషీన్ వద్దకు వెళ్లి స్టార్ బటన్ (Start Button) ను నోక్కాలి. వెంటనే మీరు ఎంత (ఉదా. రూ. 10) మేరకు పానీ పూరీ తినాలని భావిస్తున్నారో అంత సంఖ్యను నోక్కాలి. అనంతరం ఎంటర్ బటన్ (Enter Button) నొక్కాలి. తర్వాత మెషీన్ కింద అమర్చిన ఏటీయం కార్డు పెట్టేలా నున్న ఓ బాక్సులోకి కరెన్సీ నోటును పెట్టాలి. అది లోపలికి తీసుకుంటుంది. కొన్ని నిమిషాల అనంతరం ఎన్ని గప్ చుప్ లు వస్తాయో మెషిన్ పై చూపిస్తుంది. ఆతరువాత పక్కనున్న మరో వైపు నుంచి అదే సంఖ్యలో పానీపూరీ వస్తుంది.

దానికి వున్న ఓ గాజు గ్లాసు కిందకు దిగగానే ఒక్కోక్కటిగా మెల్లిగా పానీపూరి వస్తాయి. వాటిని అమాంతం తీసుకుని నోట్లో పెట్టేసుకోవడమే. అయితే కరోనా సీజన్ కాబట్టి ముందుగా ఆ పక్కనే అమర్చివున్న పేపర్ ప్లేట్ తీసుకుని దానిలో పానీపూరి పెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని లాగించేయాల్సిందే. ఈ అద్భుతమైన పరికరాన్ని అస్సాంకు చెందిన ఓ యువ ఇంజనీరు రూపోందించినట్లు తెలుస్తోంది. అయితే దీని రూపకర్తకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం అందుబాటులో లేవు. కాగా దీనిని తయారు చేసినట్లు చెబుతున్న వ్యక్తి.. ఆరు నెలలుగా దీనికోసం కష్టపడ్డానని వీడియోలో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corona innovation  covid 19  coronavirus  pani puri vending machine  pani puri AVM  Assam  

Other Articles