Janasena now urges for University Students and ITIans మళ్లీ విద్యార్థుల పక్షాన నిలిచిన పవన్ కల్యాణ్.. ఐటీఐ, డీగ్రీ సహా అన్నీ..

Pawan kalyan now urges for university students and itians

Pawan Kalyan, YSRCP Government, Under Gradutes, post Graduates, Degree, IITans, ITIans, Engineering students, 10th class students, 10th class exams, 10th results, Intermiediate supplimentary exams, inter supplimentary exams, coronavirus, JanaSena, Twitter, Andhra Pradesh, Politics

Janasena chief Pawan Kalyan now stands for University students who are in the last semister of their degree and PG including MBA, MCA, ITI, Engineering students. The Janasenani urges Andhra Pradesh government to cancel the exams, and issue grades.

మళ్లీ విద్యార్థుల పక్షాన నిలిచిన పవన్ కల్యాణ్.. ఐటీఐ, డీగ్రీ సహా అన్నీ..

Posted: 06/23/2020 11:10 PM IST
Pawan kalyan now urges for university students and itians

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంతో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోమారు విద్యార్థుల పక్షాన నిలిచాడు. కేవలం పదో తరగతి వారు మాత్రమే విద్యార్థులు కాదని తాము కూడా విద్యార్థులమేనని, తమకు కూడా వారికి కల్పించిన మినహాయింపులే కల్పించాలని కోరుతూ పవన్ కల్యాణ్ వద్ద వినతులు వెల్లివిరిసాయి, దీంతో పవన్ కల్యాణ్ మరోమారు ప్రభుత్వ ముంగిట తన వినతిని పెట్టారు. పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు కల్పించిన మినహా యింపులనే వీరికి కూడా కల్పించాలని కోరారు.

ఇంతకీ విషయం ఏంటన్నది అర్థమైందిగా.. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు కల్పించిన తరహాలోనే ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ, ఏజీ బీఎస్సీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐ.టీ.ఐ వంటి విద్యలు అభ్యసించి చివరి సెమిస్టర్‌ పరీక్షలకు సిద్ధమైన విద్యార్ధులకు కూడా పరీక్షలను రద్దు చేసి వారిని కూడా ఇంటర్నల్ మార్కులతో పాటు గత సెమిస్టర్ల మార్కులను కూడా కలుపుకుని గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. హైదరాబాద్ సెంట్రీల్ యూనివర్సిటీ సహా పలు విశ్వవిద్యాలయాలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థుల మేలు కోరేలా ప్రభుత్వం నిర్ణయం వుండాలని, వుంటుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.

కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజురోజుకు తన ఉద్దృతిని పెంచుకుంటూ వ్యాప్తి చేందుతూ రాష్ట్రంలో ఏకంగా పదివేల కేసుల నమోదు చేసుకుంటున్న క్రమంలో విద్యార్థులను ప్రభుత్వం అవస్థల పాలు చేయకూడాదని సూచించారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇక రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కూడా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అరోగ్యపరంగా అత్యయిక పరిస్థితులు ఉత్పన్నమైన వేళ.. సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరారు పవన్ కల్యాణ్. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్ ‌ను దృష్టిలో ఉంచుకొని విశ్వ విద్యాలయాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు.

ఈ మేరకు జనసేన పార్టీ తరపున ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఓ వినతి ప్రత్రాన్ని విడుదల చేశారు. విద్యార్థులు తమ కాలేజీలు ఉన్న పట్టణాలు, నగరాలకు వెళ్ళడం, హాస్టల్స్‌లో ఉండి పరీక్షా కేంద్రాలకు వెళ్ళి రావడం వారి ఆరోగ్యాలకు శ్రేయస్కరం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు పై చదువులకు వెళ్ళేందుకు, క్యాంపస్‌ సెలెక్షన్స్‌‌లో జరిగిన ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికెట్స్‌ ఇచ్చేందుకు సమయం దగ్గరపడుతోందని.. పరీక్షలు లేని కారణంతో పట్టాలు చేతికిరాక అర్హత కోల్పోతామనే ఆందోళన పెరుగుతోందని విద్యార్ధులు జనసేన దృష్టికి తీసుకువచ్చారని.. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles