JK: Four Terrorists Killed In Shopian Encounter దాయాధి భూతం.. భారత సేనల చేతుల్లో హతం..

Nine hizbul mujahideen terrorists gunned down by security forces j k police

Hizbul Mujahideen, Indian Army, Jammu, Kulgam, Rashtriya Rifles (RR), India, Jammu and Kashmir (J&K), Jammu, Kashmir, Shopian, Pinjora, encounter, terrorists, Armed Forces, Indian Army, J& K Police, Terrorism, counter-terrorism

Four terrorists were gunned down by joint security forces in an encounter that broke out on early Monday morning at the Pinjora village in south Kashmir's Shopian district. The slain terrorists have now been identified as members of the terror outfit 'Hizbul Mujahideen'.

దాయాధి భూతం.. భారత సేనల చేతుల్లో హతం..

Posted: 06/08/2020 01:44 PM IST
Nine hizbul mujahideen terrorists gunned down by security forces j k police

దేశ సరిహద్దులో మరోమారు కాల్పుల కలకలం రేగింది. తెల్లవారు జామున ప్రజలు గాఢనిద్రలో తుపాకుల మోతకు ఉలిక్కిపడి నిద్రలేచారు. పాకిస్థాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రభూత సంతతికి చెందిన ముష్కరులు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేయగా, వారు స్థానికంగా నక్కిన విషయాన్ని ఉప్పందుకున్న భారత ఆర్మీ, జమ్మూ-కాశ్మీర్ బలగాలు వారిని వెంటాడి మట్టుబెట్టాయి. ఇది ఇవాళ జమ్మూ-కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్. భారత ఆర్మీ, పోలీసుల సంయుక్త ఆపరేషన్ ఆద్వర్యంలో జిరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

షోపియాన్‌ జిల్లాలోని పింజోరా ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అయితే దురదృృష్టవశాత్తు ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయాలయ్యాయి. షోపియాన్ జిల్లాలో పింజోరా ప్రాంతంలో ముష్కరులు తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. అయితే పోలీసులతో పాటు భారత భద్రతా దళాలు కూడా రంగంలోకి దిగి స్థానికంగా జల్లోడ పట్టారు. ఈ క్రమంలో తప్పించుకునే మార్గం లేక ముష్కరులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపాయి.

ఈ ఎదురుకాల్పుల ఘటనల్లో హిజ్బల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. పింజోరాకు 12 కి.మీ దూరంలో ఉన్న రెబన్‌ ప్రాంతంలో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను ఆదివారం భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. మృతుల్లో ఓ హిజ్బుల్‌ కమాండర్‌ కూడా ఉన్నాడు. దాదాపు 12 గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం. నేటి ఎన్‌కౌంటర్‌తో కలిపి 24 గంటల్లో 9 మంది ముష్కరుల్ని సైన్యం అంతమొందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hizbul Mujahideen  Indian Army  Jammu  Kulgam  Indian Army  J&K Police  Terrorism  Encounter  

Other Articles