SBI Cuts Interest Rates On Saving Deposits సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ

Sbi bank fd interest rates reduced again

state bank of india, SBI Interest Rate, SBI Bank Rate, SBI Bank Interest rate, sbi bank, interest rates on savings deposits, largest lender SBI

The country's largest lender State Bank of India (SBI) has reduced interest rate on savings bank deposits by 5 basis points to 2.70% per annum across all brackets. The revised interest rate is applicable from May 31, 2020, the bank's website showed.

సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ

Posted: 06/03/2020 02:22 PM IST
Sbi bank fd interest rates reduced again

భారత్ లోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు ఆప్ ఇండియా బాటలోనే దేశంలోని మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు పయనిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న దేశ ప్రజలు.. కాస్తో కూస్తో వున్న డబ్బును బ్యాంకుల్లో పెట్టుకుందామంటే.. అక్కడ లభించే వడ్డీ రేటు కూడా క్రమంగా తగ్గిస్తున్నారు. ఎస్బీఐ సేవింగ్స్ ఎకౌంట్లపై వడ్డీని మరింతగా తగ్గించాయి. పోదుపు ఖాతాలపై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా ఎస్బీఐ ఖాతాదారుల పొదుపు ఖాతాలపై ఇస్తున్న వడ్డీని 2.75 శాతం నుంచి 2.70 శాతానికి తగ్గించింది.

ఇక తగ్గించిన వడ్డీ రేట్ల నిర్ణయం మే 31 నుంచి అమలులోకి రానుంది. ఇదే సమయంలో రూ. 50 లక్షల లోపు ఉండే ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటు 3.25 శాతం నుంచి 3 శాతానికి, రూ. 50 లక్షలపైన ఉండే డిపాజిట్లపై వడ్డీని 3.75 శాతం నుంచి 3.50 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ప్రకటించింది. ఈ తగ్గింపు 4వ తేదీ గురువారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. మిగతా బ్యాంకులు కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : state bank of india  SBI Interest Rate  SBI Bank Rate  SBI Bank Interest rate  sbi bank  

Other Articles