Powerful Amphan cyclone tears into India తీరం ధాటిన అంఫన్.. అల్లకల్లోలంగా తీరప్రాంతం

Amphan cyclone wreaks deadly havoc in india

Cyclone Amphan, Cyclone Amphan updates, Amphan cyclone, Amphan cyclone current position, cyclone amphan latest news, Amphan cyclone landfall, Amphan cyclone Kolkata, cyclone Amphan, cyclone amphan rains, Amphan cyclone odisha, Amphan cyclone West Bengal

Cyclone Amphan has commenced landfall since 2.30 pm on Wednesday and it will continue for about four hours, said Director of Indian Meteorological Department, Amphan is the Bay of Bengal's fiercest cyclone this century after it intensified with sustained wind speeds of up to 270 kilometers per hour

తీరం ధాటిన అంఫన్.. అల్లకల్లోలమైన పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలు

Posted: 05/20/2020 07:15 PM IST
Amphan cyclone wreaks deadly havoc in india

అతి తీవ్ర తుపాను అంఫన్ తీరం దాటుతూ రెండు రాష్ట్రాల తీరప్రాంతాలను అల్లకల్లోలంగా మార్చివేసింది. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తీరాన్ని తాకిన అంఫన్.. సాయంత్రం ఆరున్నర గంటల వరకు సుమారుగా నాలుగు గంటలకు పైగా సమయం తీసుకుని తీరాన్ని దాటింది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. తీరాన్ని దాటే ప్రక్రియ సందర్భంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. బెంగాల్, బంగ్లాదశ్ మధ్య సుందర్భన్ సమీపంలో ఈ పెను తుఫాను తీరం దాటినట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

కాగా, ఇవాళ రాత్రి ఏడు గంటల తరువాత అతితీవ్ర తుఫాను సంపూర్ణంగా తీరం దాటిందని వెల్లడించిన అధికారులు.. ఈ సమయంలో వీచిన భీకర గాలులు ఇటు ఒడిశా, అటు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలతో పాటు కోల్ కతా మహానగరంలోనూ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి ఇద్దరు మరణించారు. తుఫాను తీరం దాటుతున్న సమయంలో 160 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు.. దానికి తోడుగా భారీ వర్షం కొనసాగినట్టు అధికారులు తెలిపారు. ఆ తరువాత తుఫాను తీరం గాటే సమయానికి తీవ్రత కాసింత తగ్గి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని అధికారులు తెలిపారు.

ఇక అంఫన్ తుఫాను బంగ్లాదే్శ్ వైపు పయనిస్తూ క్రమంగా బలహీనపడుతుందని, ఆ తరువాత క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపారు. అంఫన్ తీరం దాటుతున్న సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతంలోని దాదాపు 4.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న అలలు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను ముంచెత్తాయని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్రా తెలిపారు. ఈ తుఫాను నేపథ్యంలో తమ అంచనాలు అన్ని నిజమయ్యాయని ఆయన పేర్కోన్నారు.

అటు ఒడిశాలో 6.5లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో పూరీ జిల్లాలోని హరిదాస్‌పూర్‌, కకట్‌పూర్‌లలో భారీ వర్షాలకు రోడ్లపై కూలిన చెట్లను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తొలగించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో కోల్‌కతాలో బంద్‌ వాతావరణం నెలకొంది.  కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ ఉత్తర్వులను సడలించడంతో తెరుచుకున్న మార్కెట్లను సైతం ఈ తుపాను దాటికి మూసివేశారు. భీకర గాలులు ధాటికి పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్‌, టెలిఫోన్‌ స్తంభాలు నేలకూలాయి. వృక్షాలు కార్లపై పడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్లు బీటలు వారాయి. మొత్తానికి ప్రాణనష్టం తక్కువగానే వున్నా అస్తినష్టం మాత్రం చాలా వుందని రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles