Driver modifies rickshaw.. Gets Anand Mahindra praise ఆనంద్ మహీంద్రా పోస్టుతో.. ఆటో డ్రైవర్ తెలివితేటలు వైరల్..

Anand mahindra is all praises for e rickshaw driver s social distancing innovation

covid, coronavirus update, rickshaw puller, e-rickshaw puller, anandn mahindra, social distancing, viral video, Coronavirus, World Health Organisation, Covid-19, Winter Season, Flu, US, UK, Africa, Asia, India, indian idealogies

Amid the novel coronavirus outbreak in the country as well as across the globe, This e-rickshaw puller garnered the highest praise possible from industrialist and chairman of Mahindra Group, Anand Mahindra for his innovative way of practicing social distancing while travelling.

ITEMVIDEOS: ఆనంద్ మహీంద్రా పోస్టుతో.. ఆటో డ్రైవర్ తెలివితేటలు వైరల్..

Posted: 04/25/2020 12:29 PM IST
Anand mahindra is all praises for e rickshaw driver s social distancing innovation

అవసరం ఎవరిచేతైనా కొత్త అలోచనలకు నాంది పలికింపజేస్తోందని పెద్దలు చెప్పిన మాట అక్షరాల మూట. ప్రస్తుతం కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఇలా జనజీవనాన్ని ఇళ్లకు మాత్రమే పరిమితం చేసిన దేశాల్లో భారత్ కూడా ఒక్కటి. అయితే భారత్ దేశం వ్యవసాయ అధారిత దేశం కావడంతో పాటు రెక్కాడితే కాని డొక్కాడని ప్రజలు కూడా అధిక సంఖ్యలో వున్న దేశంమన్న  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూట గడవాలంటే కూడా కొట్లాది కుటుంబాలు అలోచనలో పడ్డాయి. ప్రాణాలుంటూ కొన్ని రోజుల తరువాత పరిస్థితులు మారుతాయన్న పాలకుల మాటలకు ప్రాధాన్యమిస్తున్నారు.

అయితే ఓ ఆటో డ్రైవర్ మాత్రం తన మూడు చక్రాల అటోబండి నడవకపోతే.. తన బతుకు బండి నడవదని.. తీవ్రంగా అలోచించాడు. తన సెవన్ సీటర్ ఆటోను బయటకు తీసి లాక్ డౌన్ వేళ తన బండి నడుపుకునేందుకు ప్రయత్నించాడు. అయితే సామాజిక దూరం పాటించాలని.. లేని పక్షంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆటోలో ప్యాసెంజర్లను ఎలా ఎక్కించుకుని నడుపుతారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి, దీంతో తన సెవన్ సీటర్ అటోను నాలుగు చాంభర్ సీటర్ గా మార్చాడు. ఇక సవారీకి సై అన్నాడు. తన ఆటోను ఎలా మార్చాడో మీరూ ఓ లుక్కేయండీ..

ఈ ఆటో రిక్షా డ్రైవర్ తన ఆటోలో ఎక్కేవారి క్షేమం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన ఆటో లోపలి భాగాన్ని అనేక భాగాలు విభజించి, ఒక భాగానికి మరో భాగానికి మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేశాడు. మొత్తమ్మీద నలుగురు వ్యక్తులు భౌతిక దూరం పాటిస్తూ ఆటోలో ప్రయాణించేలా తన ఆటోను తీర్చిదిద్దాడు. దీనికి సంబంధించిన వీడియో చూసిన వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ముగ్దుడయ్యాడు. మన ప్రజల తెలివితేటలు, ఆవిష్కరణ శక్తులు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నాయని ట్వీట్ చేశారు. తన అభిప్రాయం ఏంటంటే, ఈ ఆటో రిక్షా డ్రైవర్ ను మన ఆర్ అండ్ డి మరియు ప్రొడక్ట్ డెవలప్ మెంట్ టీమ్ లకు సలహాదారుగా నియమించాలి అని అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles