First Lady Stitches Mask For Shelter Homes మాస్కులు కుట్టిన దేశ ప్రథమ మహిళ సవిత కోవింద్

First lady savita kovind stitches face masks for delhi shelter homes

savita kovind, ram nath kovind, savita kovind stitches face masks, coronavirus, coronavirus outbreak, coronavirus pandemic, covid-19, corona spread, India

President Ram Nath Kovind's wife Savita Kovind stitched face masks at Shakti Haat in the President's Estate on April 22 to help fight Covid-19. The masks that Savita Kovind made will be distributed across several shelter homes of the Delhi Urban Shelter Improvement Board.

మాస్కులు కుట్టిన దేశ ప్రథమ మహిళ సవిత కోవింద్

Posted: 04/23/2020 04:06 PM IST
First lady savita kovind stitches face masks for delhi shelter homes

కరోనా వైరస్‌తో భారత్‌ చేస్తున్న పోరాటంలో దేశంలోని అనేక మంది ప్రముఖులు మేము సైతం అంటూ తమ వంతుగా పేదలకు సాయం చేయడం, వలస కార్మికులకు బోజనం వసతి కల్పించడం, ఇక మరికొందరు ప్రధాన మంత్రి గరీబ్ యోజనా పథకానికి విరాళాలను ప్రకటించడంతో పాటు ఇత్యాది కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు ఈ క్రమంలో తాను సైతం అంటూ భారత ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్‌ కూడా ముందకువచ్చారు.

కరోనా మహమ్మారి గురించి తెలిసినా.. తెలియకపోయినా.. పేదల దరికి ఈ మహమ్మారి చేరకుండా అమె తనవంతుగా శ్రమకు శ్రీకారం చుట్టారు. సవితా కోవింద్‌ తమ అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్ లో తన కుట్టు మిషన్‌ ద్వారా కరోనా మాస్కులను స్వయంగా తయారుచేశారు. మాస్కులను కుట్టే సమయంలో కూడా అమె బాధ్యతగా మాస్కు ధరించారు. ప్రథమ మహిళ తయారు చేసిన మాస్కులను ఢిల్లీలోని వివిధ ఆశ్రయ కేంద్రాల్లో (షెల్టర్‌ హోమ్స్‌) ఉండేవారికి అందజేయనున్నారు.  

దేశంలో కొవిడ్‌-19  విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. వస్త్రంతో తయారు చేసిన మాస్కులు, మూడు పొరలు ఉండే సర్జికల్‌ మాస్కులు, ఎన్‌ 95 మాస్కులను లభ్యతను బట్టి ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో సవితా కోవింద్‌ స్వయంగా మాస్కులు తయారు చేసి కరోనా నుంచి పేదలకు రక్షణ కల్పించేందుకు కృషి చేస్తున్నారు. కాగా అమె మాస్కులు కుడుతున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను కర్ణాటక బీజేపి శాఖ తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : savita kovind  ram nath kovind  face masks  coronavirus  coronavirus pandemic  covid-19  India  

Other Articles