does tying of yellow-horn-in-the-neck-prevents corona ముత్తైదువులు పసుపుకొమ్ము కట్టుకోవాలన్న వార్తపై క్లారిటీ

Does tying of yellow horn in the neck prevents corona ahobila jeeyar swamy gives clarity

ahobilam jeeyar swamy, fake news, turmeric yellow horn, seven threads, social media, viral news, kurnool, Andhra Pradesh, Telangana, lockdown impact, CM KCR, coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamuddin event Telangana

ahobilam jeeyar swamy gives clarity on the news doing rounds in social media that coronavirus does not do harm to the families of married women, if they ties turmeric yellow horn in their neck with seven threads. The holyman says it is a just a fake news on his name.

ముత్తైదువులు పసుపుకొమ్ము కట్టుకోవాలన్న వార్తపై క్లారిటీ

Posted: 04/23/2020 05:19 PM IST
Does tying of yellow horn in the neck prevents corona ahobila jeeyar swamy gives clarity

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూ.. మానవజాతి మనుగడకే సవాల్ విసురుతోంది. కరోనా మహమ్మారి ధాటికి అభివృధ్ది చెందిన దేశాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాపై అవగాహన కల్పించి.. సామాజిక దూరం పాటించి.. చేతులను ఎప్పటికప్పుడు కడుకుంటూ వేడి వేడి పధార్థాలను మాత్రమే తీసుకోవాలని అటు అయుష్, ఇటు అయుర్వేద ప్రముఖులతో పాటు పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇదే క్రమంలో కొందరు మాత్రం వితండవాదానికి తెరతీస్తూ. మద్యం తాగితే కరోనా రాదని పుకార్లు పుట్టిస్తున్నారు.

ఇదేమార్గంలో మరికొందరు మరో వార్తను కూడా విపరీతంగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. హిందూదేశంగా బాసిల్లుతున్న భారతావనిలో ఇక్కడి ప్రజలు ఆచరించి, అధిక ప్రాధాన్యనిచ్చే సంస్కృతీ సంప్రదాయాలతోనూ ఆటలాడేందుకు సాహసిస్తున్నారు. అమావాస్య రోజున దేశంలోని ముత్తైదువులు పసుపుగొమ్మును తమ మెడలో కట్టుకుంటే వారకి కరోనా నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లదని ప్రచారం చేశారు. అంతేకాదు ఏకంగా ఏడు దారాలతో దారాన్ని ఒక్కటిగా పేనిన తరువాత దానితో పుసుపు గొమ్మును ముడి వేయాలని ఆ తరువాత దానిని కట్టుకోవాలని ప్రచారం విపరీతంగా జరిగింది.

దీంతో ఇలా చేసిన మహిళల కుటుంబాలను కరోనా వైరస్ తాకదని, తాకినా ఎలాంటి హాని తలపెట్టదని ఓ తప్పుడు వార్తను సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం చేశారు. మాంగాళ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే మహిళలు.. కుటుంబానికి కూడా అగ్రతాంబులం ఇవ్వడంతో.. ఈ వార్త నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. భారతదేశంలో అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాల్లోనే వుండటంతో ఈ వార్తకు అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని.. ఇందులో ఎలాంటి సత్యం లేదని మరికొందరు వాదిస్తున్నారు. హేతువాదులైతే ఇది కేవలం కొందరు చేస్తున్న విషప్రచారమని అన్నారు.

విపరీతంగా ప్రచారం పొందుతున్న ఈ వార్తపై శ్రీశ్రీశ్రీ అహోబిల జీయర్ స్వామి స్పష్టతనిచ్చారు. ముత్తైదువులు అమావాస్యలోపు 7 దారాలతో పుసుపుకొమ్ములు ధరించాలని వస్తున్న వాదనలు అవాస్తవమని తేల్చిచెప్పారు. అమావాస్య తర్వాత వాటిని తీసివేయాలని చినజీయర్‌ స్వామి చెప్పినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, వాటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్‌ కట్టడి కావాలంటే ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, భగవంతుడిని ధ్యానిస్తే అందరికీ మానసిక బలం చేకూరుతుందని హితవు పలికారు. మానసిక ఒత్తిడి తగ్గడానికి భగవంతుడిని స్మరించాలని సూచించారు. ఏ రోగమైనా నివారణకు వైద్య చికిత్స మాత్రమే మార్గమని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles