Coronavirus Cases Raise to 644 In Telangana తెలంగాణలో 644కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు..

New coronavirus cases reported in telangana tally rises to 644

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

The total number of positive coronavirus cases reached 644 in Telangana on Wednesday said the Health Department of the state, While

తెలంగాణలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు, 644కు చేరిన సంఖ్య

Posted: 04/15/2020 11:40 AM IST
New coronavirus cases reported in telangana tally rises to 644

తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికీ 17 మంది రాష్ట్రవాసులను పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి.. తాజాగా మరోకరిని బలి తీసుకోవడంతో మృతుల సంఖ్య మొత్తంగా 18కు చేరింది. ఇక మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా మరింత పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 644కి చేరింది. నిన్న ఒక్క రోజే ఏకంగా 41 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.

గత వారం ఒక్క రోజే 75 కేసులు. క్రితం రోజున 60 కేసులు నమోదు అయిన తరువాత మళ్లీ నలబై కేసులు వెలుగుచూడటం తెలంగాణ వాసులలో అందోళన రేకెత్తుతుంది. 644 మందిలో ఇప్పటి వరకు 110 మంది మంది కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య ప్రస్తుతం 410గా వుంది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 18 మంది బారిన పడి చికిత్స పొందుతున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 644కు పెరిగింది. వీటిలో హైదరాబాద్‌లో నమోదైన కేసులే అధికంగాఉండడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తంగా  110 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రోజురోజుకు కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. తెలంగాణకు 95 శాతం కరోనా భయం తగ్గిందని.. ఇకపై కరోనా పాజిటివ్‌‌ కేసులు భారీగా నమోదు కాకపోవచ్చని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పిన తరుణంలోనూ పాజిటవ్ కేసులు పెరుగుతండడం అందోళన రేకెత్తిస్తుంది. ఇప్పటివరకు వరకు రాష్ట్రంలో 644కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు ఏకంగా 18 మంది మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles