excise duty on petrol and diesel hiked ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు.. బిల్లు అమోదం..

Coronavirus impact government raises cap on excise duty on petrol and diesel

petrol, diesel, excise duty on petril, excise duty, PM Modi, petrol price today, diesel price today, dharmendra pradhan, India, Politics

The government has increased the cap on special additional excise duty on petrol and diesel by Rs 18 and Rs 12 per litre, according to amendments passed in the Finance Bill. The current cap on the same was Rs 10 for petrol and Rs 4 for diesel.

ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు.. బిల్లు అమోదం..

Posted: 03/24/2020 12:56 PM IST
Coronavirus impact government raises cap on excise duty on petrol and diesel

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అన్న చందాన.. అసలే కరోనా వైరస్ వ్యాప్తితో తీవ్ర అందోళన చెందుతున్న తరుణంలో దేశ ప్రజలు ఇప్పటికే తమ ఇళ్లలో క్వారంటైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే దేశ ఆర్థిక పరిస్థితి మందగమనంలో సాగుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా కరోనా వైరస్ శాపంలా పరిణమించింది. దీంతో అటు దేశ ప్రజలు కూడా సొంత ఇళ్లలో క్వారంటైన్ చేయాల్సిన పరిస్థితితో ప్రజలకు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రజలపై అందులోనూ ముఖ్యంగా వాహనదారులపై పెనుభారం పడనుంది.

దేశ ఖజానాకు రాబడిని పెంచుకునే మార్గాలపై దృష్టి సారించిన ఎన్డీయే సర్కారు, ప్రత్యేక పరిస్థితుల్లో లీటరు పెట్రోల్ పై రూ. 18 వరకూ, డీజిల్ పై రూ. 12 వరకూ ఎక్సైజ్ సుంకాలను పెంచుకునేలా చట్ట సవరణ చేసింది. ఈ సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించగా, లోక్‌ సభలో ఎటువంటి చర్చ జరగకుండానే ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. ఇంతకుముందు పెట్రోల్‌ పై రూ.10, డీజిల్‌ పై రూ. 4 వరకు మాత్రమే ఎక్సైజ్‌ సుంకం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి చట్ట పరంగా అవకాశం ఉండేది.

ఇటీవలి కాలంలో నెలకొన్న అంతర్జాతీయ అనిశ్చితి క్రూడాయిల్ మార్కెట్ ను కుదేలు చేశాయి. ఇప్పటికే బ్యారల్ ముడి చమురు ధర 30 డాలర్ల దిగువకు పడిపోయింది. చమురు ధరలు కనిష్ఠ స్థాయులకు చేరడంతో, కేంద్ర ఖజానాకు ఆదాయం తగ్గింది. దీంతో ఈ నెల 14న పెట్రోల్, డీజిల్ పై రూ. 3 చొప్పున సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ఈ చర్యతో రూ. 39 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ఇదే సమయంలో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉండటంతో, భవిష్యత్తులోనూ ఎక్సైజ్ సుంకాలను పెంచుకునే వెసులుబాటు తమ వద్ద ఉంచుకునేందుకే కేంద్రం ఈ చట్ట సవరణను తెరపైకి తెచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles