drinking alcohol protect you from covid-19? మద్యం తాగితే కరోనా వ్యాధి సోకదా.?

Can alcohol drinkers actually survive the corona virus

world health organisation, alcohol, warm water, Coronavirus, covid-19, cold, dry cough, Epidermic, rumors on corona, Coronavirus news, schools, cold, dry cough, secundrabad, corona spread, Coronavirus new case, Coronavirus cases, Coronavirus Hyderabad, coronavirus latest, Coronavirus latest updates, Coronavirus Case in Raheja Mindspace, Hyderabad, remedy for Coronavirus, covid-19, Telangana, Health

In the wake of coronavirus, among several pieces of information available on internet, there is one that asks people to 'drink alcohol to stay safe and kill the deadly virus', which, according to the World Health Organisation is not True.

మద్యం తాగితే కరోనా వ్యాధి సోకదా.? అల్కాహాల్ ప్రయోజనకారేనా.?

Posted: 03/09/2020 03:51 PM IST
Can alcohol drinkers actually survive the corona virus

యావత్ ప్రపంచాన్ని భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతుంది. చైనాలో కాసింత శాంతించి.. అదుపులోకి వస్తున్న కరోనా బాధితుల సంఖ్య ఇక ప్రపంచంలోని ఇతర ప్రాంతంలో అందోళన చెందెలా కరోనా బాధితుల సంఖ్య పెరగుతొంది. ఈ తరుణంలో ఇటు భారత్ లోనూ కరోనా కేసుల రెండు రోజుల వ్యవధిలోనే పదికేసులు పెరిగాయి. కేరళలోని మూడేళ్ల చిన్నారిని కూడా వదలని కరోనా వైరస్ మహమ్మారి.. అటు ఇటలీ, యూరోప్ దేశాలలోనూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఫలానా చేస్తే కరోనా వ్యాధి సోకదంటూ అనేక కథనాలు అంతర్జాలంలో దర్శనమిస్తున్నాయి.

వాటిల్లో ఒకటి మద్యం. ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందని ఒకటి, ఆల్కహాల్ నుగానీ, క్లోరిన్ ను గానీ శరీరంపై స్ప్రే చేసుకుంటే వైరస్ పోతుందని మరొకటి, వేడి నీళ్లతో స్నానం చేస్తే వైరస్ సోకదని ఇంకొకటి.. ఇలా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని పక్కనబెడితే తాజాగా ఔషద గుణాలున్న అల్లం, వెలుల్లిలను వేడి నీళ్లలో వేసి కాచిన తరువాత గోరువెచ్చిన నీళ్లతో కూడా వైరస్ తగ్గుతుందని సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కోడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది.

కరోనా వైరస్ నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్లతో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని డబ్ల్యూహెచ్ వో, డాక్టర్లు ప్రకటించారు. హ్యాండ్ శానిటైజర్లలో 90 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. మిగతా పదిశాతం మరికొన్ని రసాయనాలు ఉంటాయి. అంతేకాకుండా ఆల్కహాల్, క్లోరిన్ రెండూ సూక్ష్మజీవులను నాశనం చేస్తాయన్నది ముందు నుంచీ తెలిసిందే. అయితే ఆల్కహాల్ తాగితే కరోనా వైరస్ చచ్చిపోతుందన్న ప్రచారం సత్యదూరమని అంటున్నారు ప్రపంచ ఆరోగ్యసంస్థ శాస్త్రవేత్తలు. ఆల్కహాల్ తో వైరస్ వంటి సూక్ష్మ జీవులు చనిపోతాయన్నది వాస్తవమే.

అయితే బాధితులు ఆల్కహాల్ తాగితే అది కేవలం రక్తంలో కలిసి, ఫిల్టర్ అవుతుందని, ఏ సూక్ష్మ క్రిమిపైనా ప్రభావం చూపడం ఉండదని డబ్ల్యూహెచ్ వో స్పష్టం చేసింది. ఇక శరీరంపై ఆల్కహాల్, క్లోరిన్ పూసుకోవడం వల్ల చర్మంపై ఉండే వైరస్ చనిపోతుందే..తప్ప అప్పటికే శరీరం లోపలికి చేరిన వైరస్ పై ఎలాంటి ప్రభావం ఉండదని వివరించింది. ఆల్కహాల్ ఉండే హ్యాండ్ రబ్ లు, హ్యాండి శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని తెలిపింది. ఇక వేడి నీళ్లతో స్నానం చేస్తే వైరస్ రాదన్న ప్రచారం కూడా అవాస్తవమని చెప్పింది. అయితే వేడి నీళ్లతో గొంతు పుక్కిలించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles