BJP and Jana Sena will fight local bodies: pawan kalyan స్థానిక సంస్థల ఎన్నికల్లో పోత్తుపై చర్చించాం: పవన్ కల్యాణ్

Bjp janasena had detailed talks for local body elections pawan kalyan

Janasena, BJP, Pawan Kalyan, JanaSena, BJP, Nadendla Manohar, local body elections, JP Nadda, New Delhi, Vijayawada, Amaravati, Visakhapatnam, wrong propaganda, defamation suit, social media, false articles, farmers, Capital city, Amaravati, agitation, Sunil Deodhara. GVL Narasimha Rao, AP CM Jagan, YSRCP party, Andhra Pradesh, Politics

Janasena Party leader and Telugu film star Pawan Kalyan said he had detailed talks with union minister and BJP national President JP Nadda on local body elections in Andhra Pradesh. The JanaSena chief Said they are havine a good ideology and organised planing to fight in the elections.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోత్తుపై చర్చించాం: పవన్ కల్యాణ్

Posted: 03/07/2020 03:12 PM IST
Bjp janasena had detailed talks for local body elections pawan kalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేనెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపి-జనసేన కలసి పోరాడేందుకు సంసిద్దత వ్యక్తం చేశాయని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో అన్ని అంశాలపై నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిపామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపి జనసేన కలిసి పోటీ చేయడం, ఎవరెన్ని స్థానాల్లో బరిలోకి దిగాలన్న విషయాలపై వివరంగా మాట్లాడుకున్నట్టు చెప్పారు.

జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాదేండ్ల మనోహర్ తో కలసి జేపి నడ్డాను కలిసిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల నుంచే తమ పొత్తుతో ఎన్నికల సమరాంగనంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. అనంతరం, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవ్వాలనే విషయమై చాలా లోతుగా చర్చించామని అన్నారు. స్థానికంగా ఏ విధంగా పోటీ చేయాలనే దానిపై ఈ నెల 8వ తేదీన విజయవాడలో జనసేన, బీజేపీ నాయకులు సమావేశమై చర్చిస్తామని చెప్పారు.

జనసేన–బీజేపీ పొత్తును విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, చక్కటి ప్రణాళిక మేరకు 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇరుపార్టీలు కలిసి మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. ఏపీ ప్రజలకు మంచి ప్రత్యామ్నాయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు మంచి కార్యాచరణతో ముందుకెళ్లాలని, ఎన్నికలకు సంసిద్ధమయ్యేందుకు ఇరుపార్టీలు కలిసి పని చేసుకోవాలని ఈ భేటీలో చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నట్టు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  BJP  Nadendla Manohar  local body elections  JP Nadda  New Delhi  Andhra Pradesh  Politics  

Other Articles