Sanchaita Raju new Simhachalam temple trust chief సింహాచల ఆలయ ట్రస్టు చైర్మన్ గా సంజయిత

Sanchaita assumes charge as chief of simhachalam board

P. Sanchaita Gajapathi Raju, P. Anand Gajapathi Raju, former MP and Minister, Sri Varaha Lakshmi Narasimha Swamy Devasthanam Temple Trust Board, simhachalam temple chairperson, MANSAS (education trust), Vizianagaram, VISAKHAPATNAM, Andhra pradesh, politcis

P. Sanchaita Gajapathi Raju, daughter of late P. Anand Gajapathi Raju, former MP and Minister. took oath as chairperson of the Sri Varaha Lakshmi Narasimha Swamy Devasthanam Temple Trust Board in the temple premises at Simhachalam

అశోక్ గజపతి రాజుకు షాకిచ్చిన సర్కార్.. సంజయితకు అందలం..

Posted: 03/05/2020 01:34 PM IST
Sanchaita assumes charge as chief of simhachalam board

టీడీపీ సీనియర్ నేత అశోక్‌ గజపతిరాజుకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికలలో ఓటమిని చవిచూసినా.. రాజవంశ సంస్థానాధీశుడైన ఆయన రెండు పదవులను కొనసాగుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆశోక్ గజతిరాజుకు ఆ రెండు పదవులను దూరం చేసింది. దీనిపై ఆయన న్యాయపోరాటం చేస్తానని అంటున్నారు. కాగా, ప్రస్తుతం ఆయన సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవితో పాటు మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సాస్‌) ట్రస్టు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారిు.

ఈ మేరకు ఈ రెండు పదవులను నుంచి అశోక్ గజపతి రాజును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సాస్‌) ట్రస్టు అధ్యక్ష పదవితో పాటు సింహాచల దేవస్థానం ట్రస్టు చైర్మన్ పదవి నుంచి కూడా అశోక్‌ను తప్పించింది. ఈ రెండు పదవుల్లోనూ ఆయన సోదరుడు, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులు అందిన వెంటనే సంచయిత ప్రమాణ స్వీకారం చేశారు.

మాన్సాస్‌ ట్రస్టు పరిధిలో సింహాచలం ఆలయం సహా 108 దేవాలయాలు ఉన్నాయి. వేల కోట్ల విలువైన 14,800 ఎకరాల భూములు, విద్యాసంస్థలు, భవనాలు ఈ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి. కాగా, అశోక్‌గజపతిరాజును రెండు పదవుల నుంచి తప్పించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ట్రస్ట్ సారథ్యంలో ఉన్న విలువైన ఆస్తులను పరాధీనం చేసే కుట్రతోనే ఆయనను పదవుల నుంచి తొలగించినట్టు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆమె నియమాకం చెల్లదని, మాన్సాస్ ట్రస్ట్ డీడ్ ప్రకారం రాజవంశంలో పెద్దవాడైన పురుష వారసుడే ట్రస్ట్ చైర్మన్‌గా ఉండాలని చెబుతున్నారు. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని అశోక్ అనుచరులు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles